హిందీలో ‘అరుంధతి’ మూవీ.. జేజమ్మగా దీపికా పదుకొనె ..?

by Dishafeatures1 |
హిందీలో ‘అరుంధతి’ మూవీ.. జేజమ్మగా  దీపికా పదుకొనె ..?
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా దీపిన పదుకోన్‌కి ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్.. డిమాండ్ ఉందో చెప్పక్కర్లేదు. జస్ట్ గ్లామర్ పాత్రాలు మాత్రమే కాకుండా ‘పద్మావత్‌’, ‘బాజీరావ్‌ మస్తానీ’ వంటి చిత్రాలో నటించి.. రాజసంతో కూడిన పాత్రలకు ఆమె కేరాఫ్‌ అడ్రస్‌ గా మారిపోయింది. అయితే తాజా సమాచారం ప్రకారం దీపిక త్వరలో మరో పవర్‌ఫుల్‌ పాత్రలో కనపడనుంది. అది కూడా తెలుగులో సంచలనాలు సృష్టించిన సినిమాకు చెందిన పాత్ర. మరి ఇంతకీ ఏంటా సినిమా అంటే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన ‘అరుంధతి’.

ఈ మూవీ తెలుగులో ఎంతటి విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ‘జేజమ్మ’ గా అద్భుతమైన నటనతో తనను తాను నిరూపించుకుంది అనుష్క. దీంతో ఆమె కెరీర్ కూడా ఓ మలుపు తిరిగింది. కాగా త్వరలో దీపిక పదుకోన్‌ కూడా జేజమ్మగా బాలీవుడ్‌ తెరపై మెరవనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్‌ వర్క్‌ కూడా జరిగిపోతున్నయట. అది కూడా ఈ మూవీన్ని తెలుగు దర్శకుడే డైరెక్ట్‌ చేయనున్నారని సమాచారం. మిగతా వివరాలు తెలియాల్సివుంది.

Read More..

కుమారుడి ప్రీ వెడ్డింగ్ వేడుకలో నీతా అంబానీ క్లాసికల్ డ్యాన్స్.. వీడియో వైరల్


Next Story