మ్యాడక్ ఫిలింస్ డ్రీమ్ ప్రాజెక్ట్ నుంచి దీపికా ఔట్.. ఆ భారీ సినిమాలో చాన్స్ కొట్టేసిన శ్రద్ధా కపూర్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-10 06:49:21  IST  )

పరశురాముడి లాంటి పవర్‌ఫుల్ క్యారెక్టర్ పక్కన శ్రద్ధా కపూర్ ఉంటే ఆ క్రేజ్ వేరేలా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారట.

మ్యాడక్ ఫిలింస్ డ్రీమ్ ప్రాజెక్ట్ నుంచి దీపికా ఔట్.. ఆ భారీ సినిమాలో చాన్స్ కొట్టేసిన శ్రద్ధా కపూర్!
X

దిశ, సినిమా: బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ‘స్త్రీ’ సినిమాతో మ్యాడక్ ఫిలింస్‌కు కాసుల వర్షం కురిపించిన ఈ బ్యూటీ, ఇప్పుడు అదే బ్యానర్‌లో రాబోతున్న అతిపెద్ద ప్రాజెక్ట్ ‘మహావతార్’ లో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. పరశురాముడిగా నటిస్తున్న విక్కీ కౌశల్ సరసన శ్రద్ధా కపూర్ ఎంపిక దాదాపు ఖరారైనట్లేనని సమాచారం. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మొదట దీపికా పదుకొణె పేరు గట్టిగా వినిపించింది. కానీ, పరశురాముడి లాంటి పవర్‌ఫుల్ క్యారెక్టర్ పక్కన శ్రద్ధా కపూర్ ఉంటే ఆ క్రేజ్ వేరేలా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారట. పైగా మ్యాడక్ ఫిలింస్ కు శ్రద్ధా ఒక గోల్డెన్ లెగ్. ఆమె ఉంటే సినిమా హిట్టే అనే సెంటిమెంట్ కూడా ఉండటంతో, శ్రద్ధా వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. జూన్ తర్వాత షూటింగ్ మొదలయ్యే ఈ సినిమాలో శ్రద్ధా పాత్ర చాలా ఎమోషనల్‌గా, బలంగా ఉంటుందని సమాచారం.

ఒకవేళ శ్రద్ధా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, మ్యాడక్ ఫిలింస్‌ బ్యానర్‌లో ఆమెకు ఇది ఐదో సినిమా అవుతుంది. ప్రస్తుతం శ్రద్ధా రేంజ్ మాములుగా లేదు. ఒకవైపు ‘స్త్రీ 3’ పనుల్లో బిజీగా ఉంటూనే, మరోవైపు ‘ఈత’ అనే బయోపిక్ మూవీలో నటిస్తోంది. ఇప్పుడు ‘మహావతార్’ కూడా తోడవ్వడంతో అమ్మడు ఫుల్ బిజీ అయిపోయింది. దర్శకుడు అమర్ కౌశిక్ ఈ సినిమాను ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని విధంగా మలిచేందుకు ప్లాన్ చేస్తున్నారు. పరశురాముడి జీవిత కథ ఆధారంగా వస్తున్న ఈ చిత్రం మైథలాజికల్ టచ్‌తో కూడిన భారీ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇక మ్యాడాక్ ఫిలింస్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఈ సినిమాలో విక్కీ కౌశల్ - శ్రద్ధా కపూర్ కాంబినేషన్ వెండితెరపై ఒక ఫ్రెష్ ఫీలింగ్‌ను ఇస్తుందని ఫ్యాన్స్ కూడా తెగ ఖుషీ అవుతున్నారు.

Next Story