‘స్పిరిట్’ విషయంలో దీపికా చేసింది కరెక్ట్.. అసలు నిజాలు బయటపెడుతూ స్టార్ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి(Sandeep Reddy), పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తున్న చిత్రం ‘స్పిరిట్’(Spirit).

‘స్పిరిట్’ విషయంలో దీపికా చేసింది కరెక్ట్.. అసలు నిజాలు బయటపెడుతూ స్టార్ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి(Sandeep Reddy), పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తున్న చిత్రం ‘స్పిరిట్’(Spirit). అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొణె(Deepika Padukone)ను తీసుకున్నారట. కానీ చివరి నిమిషంలో అత్యధిక రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో పాటు పని గంటల విషయంలో కండీషన్లు పెట్టడంతో సందీప్ రెడ్డి వంగాకు కోపం వచ్చి ఆమెను ‘స్పిరిట్’ నుంచి తొలగించేశాడు. దీపికా స్థానంలోకి త్రిప్తి డిమ్రిని సెలెక్స్ చేసి అధికారిక ప్రకటన విడుదల చేశాడు. అంతేకాకుండా ఓ స్టార్ హీరోయిన్ పీఆర్ఓ స్టోరీ లీక్ చేస్తానని అన్న విషయాన్ని కూడా బయటపెట్టడంతో ఈ సంఘటన కాస్త సంచలనంగా మారింది.

తాజాగా, ఈ విషయంపై బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కబీర్ ఖాన్ స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘దీపిక సెట్‌లో 8 గంటల పని మార్పు కోసం చేసిన అభ్యర్థనలో న్యాయం ఉంది. నా దృష్టిలో ఆమె అలా చేయడమే కరెక్ట్. అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్‌తో సహా అనేక మంది సీనియర్ నటులు ఇప్పటికే అలాంటి షెడ్యూల్‌లను అనుసరిస్తున్నారు. అయితే నేను ఒక సెట్‌లో 500 మందితో కలిసి పని చేస్తాను. ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం, పనికి మించిన జీవితం ఉంటుందని అనుకుంటాను.

మానసిక ఆరోగ్యం, సామర్థ్యం కూడా అంతే ముఖ్యమైనవి. చిత్రనిర్మాణం కోసం వ్యక్తిగత సమయాన్ని పణంగా పెట్టకూడదు. అమీర్ ఖాన్ 8 గంటల షిఫ్ట్‌లో పనిచేస్తాడు. అక్షయ్ కుమార్ కూడా అలాగే చేస్తారు. దాని గురించి అడిగిన దీపికను ఎందుకు తిరస్కరించారో నాకు అర్థం కావడం లేదు. దీన్ని నిరాకరించడానికి దర్శకులకు సరైన కారణం ఉండాలి. అయితే నేనెప్పుడూ 12 గంటలకు మించి షూటింగ్ చేయలేదు. అలాగే ఆదివారం కూడా షూటింగ్ చేయను’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story