మోనితకు పోటీగా.. బిగ్ బాస్ హౌస్‌లోకి వంటలక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

by Disha Web Desk 7 |
మోనితకు పోటీగా.. బిగ్ బాస్ హౌస్‌లోకి వంటలక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ?
X

దిశ, సినిమా: తెలుగు ‘బిగ్ బాస్ సీజన్7’ ఇటీవల ఎంతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా కంటెస్టెంట్స్ తమ పర్ఫామెన్స్‌తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఈసారి సీరియల్ యాక్టర్స్ ఎక్కువగా ఉన్నారు. ఇందులో శోభ శెట్టి అలియాస్ మోనిత ఒకరు. ఇక ఈ నటి కార్తీకదీపం సీరియల్ ద్వారా భారీ పాపులారిటి సొంతం చేసుకుంది. ఇక ఈ సీరియల్‌లో వంటలక్క దీప, మోనితకు మధ్య ఎలాంటి గొడవలు ఉండేవో మనం చూశాం. అయితే బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత కూడా శోభ శెట్టి సీరియల్‌లో మాదిరిగానే తన విలనిజం చూపిస్తుంది. దీంతో నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈమెకు గట్టి పోటీ ఇవ్వాలంటే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వంటలక్కను కూడా బిగ్ బాస్‌లోకి దించాలని, అప్పుడు షో మరింత రసవత్తరంగా సాగుతుందంటున్నారు.



Next Story

Most Viewed