- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియాంక చోప్రా ఇంట్లో తీవ్ర విషాదం.. నిక్ జోనస్ సోదరి కన్నుమూత!
నా సోదరి శాశ్వతంగా దూరమైపోయింది. మాయా.. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను, నిన్ను మిస్ అవుతున్నాను అంటూ తన బాధను వ్యక్తపరిచారు.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రియాంక భర్త, ప్రముఖ హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్‌కు అత్యంత సన్నిహితురాలు, ఆయన తన సొంత సోదరిలా భావించే మాయా కిబెల్ కన్నుమూశారు. కేవలం 30 ఏళ్ల వయసులోనే ఆమె మరణించడం జోనస్ కుటుంబాన్ని తీరని వేదనకు గురిచేసింది. మాయా కిబెల్ గత కొంతకాలంగా విల్సన్ అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ వ్యాధి కారణంగా శరీరంలో రాగి ఎక్కువగా పేరుకుపోయి కాలేయం, మెదడు, ఇతర కీలక అవయవాలు దెబ్బతింటాయి. మార్చి 7న మాయా అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోవడంతో, ఆ సమయంలో ఆమె గుండె, ఊపిరితిత్తులు పనిచేయడం ఆగిపోయాయని తెలుస్తోంది.
వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స ఫలించక ప్రాణాలు విడిచారు. మాయా మరణం గురించి ఆమె తల్లి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగా.. దానికి నిక్ జోనస్ అత్యంత భావోద్వేగంతో స్పందించారు. "నా సోదరి శాశ్వతంగా దూరమైపోయింది. మాయా.. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను, నిన్ను మిస్ అవుతున్నాను" అంటూ తన బాధను వ్యక్తపరిచారు. నిక్ జోనస్ కెరీర్ ప్రారంభం నుండి మాయా కుటుంబం ఆయనకు వెన్నంటి ఉంది. ప్రియాంక చోప్రా కూడా మాయాతో మంచి అనుబంధాన్ని కలిగి ఉండటంతో మెగా ఫ్యామిలీ ఈ వార్త విని షాక్‌కు గురైంది. ప్రస్తుతం నిక్ జోనస్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు, నెటిజన్లు మాయా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నిక్ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు.






