టాలీవుడ్ హీరోయిన్ సదా ఇంట్లో తీవ్ర విషాదం.. మిస్ యూ అంటూ భావోద్వేగ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-20 02:28:48  IST  )

టాలీవుడ్ హీరోయిన్ సదా(Sadha ) ఇంట్లో తీవ్ర విషాద్ చోటుచేసుకుంది. ఆమె తండ్రి సయ్యద్ వారం రోజుల క్రితమే మరణించారు.

టాలీవుడ్ హీరోయిన్ సదా ఇంట్లో తీవ్ర విషాదం.. మిస్ యూ అంటూ భావోద్వేగ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ సదా(Sadha ) ఇంట్లో తీవ్ర విషాద్ చోటుచేసుకుంది. ఆమె తండ్రి సయ్యద్ వారం రోజుల క్రితమే మరణించారు. ఈ విషయాన్ని తెలుపుతూ సదా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘మా నాన్న చనిపోయి వారం రోజులైంది. కానీ ఓ యుగం గడిచినట్లు అనిపిస్తుంది. సినిమా అనేది అమ్మాయిలకు ఏమంత సేఫ్ కాదని అందరూ చెప్పినప్పటికీ నాకోసం అందరికీ వ్యతిరేకంగా నాకు సపోర్ట్‌గా నిలిచారు. అమ్మకు కుదరకపోవడం వల్ల నాతో పాటు షూటింగ్‌లకు రాలేకపోయేది.

దీంతో నాన్న నా కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. కొన్నేళ్ల పాటు నాతో షూటింగ్స్‌కు వచ్చేవారు. నా బాధ్యతల్ని మా అమ్మ తీసుకున్న తర్వాత నాన్న క్లినిక్ పెట్టారు. ఎంతోమందికి ఆపద్భాంధవుడు అయ్యాడు. అంతేకాకుండా చాలామంది మెప్పు పొందారు. నేను ఆయన కూతురు కావడం గర్వంకారణం అని అందరూ ఆయనతో చెబుతున్నారని అనేవాడు.

కానీ ఈ రోజు ఆయన కూతురిగా నేను ఉండటం గర్వంగా భావిస్తున్నాను. తన చుట్టు ఉన్న వాళ్ల కోసం ప్రేమ, అప్యాయతను పంచిన ఆయనని చూసి గర్వపడుతున్నాను. నిజంగా ఆయన ఓ వెలకట్టలేని మనిషి మిస్ యూ నాన్న నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను’’ అని రాసుకొచ్చింది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story