Vikrant Massey: 12th ఫెయిల్ హీరో ఇంట్లో తీవ్ర విషాదం.. గుండె ముక్కలైపోయిందంటూ ఎమోషనల్ నోట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-13 06:48:08  IST  )

అహ్మదాబాద్(Ahmedabad) నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా a171 ఫ్లైట్ గురువారం ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

Vikrant Massey: 12th ఫెయిల్ హీరో ఇంట్లో తీవ్ర విషాదం.. గుండె ముక్కలైపోయిందంటూ ఎమోషనల్ నోట్
X

దిశ, సినిమా: అహ్మదాబాద్(Ahmedabad) నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా a171 ఫ్లైట్ గురువారం ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో ఏకంగా 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొన్ని క్షణాల్లోనే ఊహించని విధంగా చాలామంది మాంసం ముద్దల్లా పడిపోయారు. అయితే ఇందులో కేవలం ఒకరు మాత్రమే బతికి బయటపడ్డారు. ఈ సంఘటన ఎంతోమందిని కన్నీరు పెట్టిస్తోంది. ఇక ఈ ప్రమాదంపై రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలతో పాటు సాధారణ ప్రజలు తమ సంతాపం తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు.

ఎక్కడ చూసినా అహ్మదాబాద్ ఫ్లైట్‌కు సంబంధించిన పోస్టులే దర్శనమిస్తున్నాయి. అయితే ఈ ప్రమాదంలో బాలీవుడ్ హీరో విక్రాంత్ మస్సే(Vikrant Massey) కజిన్ బ్రదర్ చనిపోయినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ ఆయన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. ‘‘అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను తలుచుకుంటే గుండె ముక్కలైపోతుంది. ఈ బాధ నాకంటే నా అంకుల్ క్లిఫార్డ్ కుందర్‌(Clifford Kunder)కు ఇంకా ఎక్కువగా ఉంటుంది.

ఎందుకంటే.. ఈ ప్రమాదంలో ఆయన తన కుమారుడు క్లైవ్ కుందర్‌ను కోల్పోయాడు. తను ఆ విమానానికి ఫస్ట్ ఆఫీసర్ ఆపరేటింగ్‌గా ఉన్నాడు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి ఆ దేవుడు అండగా నిలవాలని కోరుకుంటున్నాను. అలాగే పలు న్యూస్ చానల్స్‌లో రాసిన విధంగా అతను నా కజిన్ కాదు. పైలట్ క్లైవ్ సుందర్ మా కుటుంబ స్నేహితులు. ఈ విషయంలో మరిన్ని ఊహాగానాలకు చోటు ఇవ్వకండి. తప్పుడు వార్తలు రాయకండి’’ అని రాసుకొచ్చాడు.

Next Story