తప్పని తెలిసినా నోరు మూసుకోవాల్సిందే.. లేదంటే ఆ డైరెక్టర్ అత్యాచారం చేస్తాడు?

by Disha Web Desk 7 |
తప్పని తెలిసినా నోరు మూసుకోవాల్సిందే.. లేదంటే ఆ డైరెక్టర్ అత్యాచారం చేస్తాడు?
X

దిశ, సినిమా : #MeToo ఆరోపణలు ఎదుర్కొంటున్న డైరెక్టర్ సాజిద్ ఖాన్‌ను బిగ్ బాస్ 16 నుంచి తొలగించాలని పలువురు నటీనటులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ చీఫ్ స్వాతి మలివాల్.. బిగ్ బాస్ హౌజ్‌ నుంచి అతన్ని బయటకు పంపించాలని కోరుతూ సమాచార ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు లేఖ రాశారు. దీంతో అప్పటి నుంచి సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువయ్యాయని.. రేప్ బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు స్వాతి.

ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్స్ షేర్ చేసిన ఆమె.. 'సహజంగానే వారు మమ్మల్ని ఆపాలనుకుంటున్నారు. నేను ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాను, తద్వారా వారు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఈ విషయాన్ని దర్యాప్తు చేయవచ్చు. దీని వెనుక ఉన్న వారిని వెంటనే అరెస్టు చేయాలి' అని కోరారు.



Next Story

Most Viewed