- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతర్జాతీయ వేదికపై ‘DC’ సినిమా ట్రైలర్.. విడుదల తేదీ ప్రకటించిన వామికా
అంతర్జాతీయ వేదికపై ఒక సౌత్ ఇండియన్ సినిమా ట్రైలర్ విడుదల కానుండటం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ విషయాన్ని హీరోయిన్ వామికా గబ్బి స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తూ పెట్టిన క్యాప్షన్ అందరిలో క్యూరియాసిటీని పెంచుతోంది.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, బాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ వామికా గబ్బి కాంబోలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘దేవదాస్’ (DC). ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ అంచనాలను పెంచేశాయి. అయితే సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ వయలెంట్ యాక్షన్ డ్రామా ఇప్పుడు గ్లోబల్ లెవల్‌లో సెన్సేషన్ సృష్టించేందుకు సిద్ధమైంది. సాధారణంగా సినిమాల ప్రమోషన్లు స్థానికంగా మొదలవుతాయి, కానీ వామికా నటించిన ‘దేవదాస్’ ఏకంగా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2026 వేదికగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కాబోతోంది. మే 15న ఈ గ్రాండ్ ఈవెంట్‌లో ‘దేవదాస్’ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
అంతర్జాతీయ వేదికపై ఒక సౌత్ ఇండియన్ సినిమా ట్రైలర్ విడుదల కానుండటం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ విషయాన్ని హీరోయిన్ వామికా గబ్బి స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తూ పెట్టిన క్యాప్షన్ అందరిలో క్యూరియాసిటీని పెంచుతోంది. "నేను నా మనసును ముక్కలు చేసుకోవడానికి సిద్ధంగా లేను’’ అంటూ ఆమె ఒక ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చారు. దీనికి రెడ్ హార్ట్, హార్ట్ బ్రేక్ ఎమోజీలను కూడా జత చేశారు. దీన్ని బట్టి సినిమాలో యాక్షన్‌తో పాటు హృదయాన్ని హత్తుకునే బలమైన ప్రేమకథ, ఎమోషన్ ఉండబోతోందని అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యాక్షన్ సీక్వెన్స్, మేకింగ్ స్టాండర్డ్స్ పరంగా సన్ పిక్చర్స్ ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తోంది. 2026 వేసవి కానుకగా ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.






