Avatar 3 OTT: ఓటీటీలోకి రాబోతున్న ‘అవతార్-3’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-13 14:31:01  IST  )

ఈ చిత్రం జూన్ 24 నుండి తెలుగు, తమిళ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని అధికారికంగా ప్రకటించారు.

Avatar 3 OTT: ఓటీటీలోకి రాబోతున్న ‘అవతార్-3’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
X

దిశ, సినిమా: దర్శకుడు జేమ్స్ కేమెరూన్ వెండితెరపై సృష్టించిన అద్భుత దృశ్య కావ్యం ‘అవతార్-3’. గతేడాది డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేసిన ఈ చిత్రం, ఓటీటీ వేదికగా అలరించబోతోంది. ‘అవతార్-3’ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ చిత్రం జూన్ 24 నుండి తెలుగు, తమిళ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని అధికారికంగా ప్రకటించారు. గత రెండు భాగాలతో పోలిస్తే ఈ సినిమా వసూళ్లు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ, విజువల్స్ పరంగా జేమ్స్ కేమెరూన్ మరోసారి మ్యాజిక్ చేశారని టాక్ వినిపించింది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే కొన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్నప్పటికీ, అది కేవలం రెంటల్ (అద్దె) ప్రాతిపదికన మాత్రమే ఉంది. అంటే సినిమా చూడాలంటే విడిగా కొంత డబ్బు చెల్లించాల్సి వచ్చేది. కానీ, జూన్ 24 నుండి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్లు ఎలాంటి అదనపు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. మీ ప్లాన్ యాక్టివ్‌గా ఉంటే నేరుగా ఈ సినిమాను ఉచితంగా చూడొచ్చు. అవతార్ సిరీస్ అంటేనే అద్భుతమైన గ్రాఫిక్స్, మనల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లే కథాంశం. జేమ్స్ కేమెరూన్ సృష్టించిన ఈ నీటి లోపలి అద్భుత లోకాన్ని చూడటానికి తెలుగు ప్రేక్షకులు కూడా సిద్ధమవుతున్నారు.

Next Story