- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివాదాస్పద ఎమ్మెల్యేతో ప్రముఖ నటి డేటింగ్.. కెమెరాకు అలా చిక్కడంతో.. (వీడియో)
హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా ఎప్పుడూ ఏదో ఒక విషయంతో న్యూస్‌లో ఉండేందుకు ట్రై చేస్తుంది. రిషబ్ పంత్‌తో లవ్ అంటూ కొన్ని రోజులు.. నాకు గుడి కట్టారని ఇంకొన్ని రోజులు.. లక్షల వాల్యూ చేసే గోల్డ్, బ్యాగ్ పోయిందని మరికొన్ని రోజులు..

దిశ, వెబ్ డెస్క్ : హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా ఎప్పుడూ ఏదో ఒక విషయంతో న్యూస్‌లో ఉండేందుకు ట్రై చేస్తుంది. రిషబ్ పంత్‌తో లవ్ అంటూ కొన్ని రోజులు.. నాకు గుడి కట్టారని ఇంకొన్ని రోజులు.. లక్షల వాల్యూ చేసే గోల్డ్, బ్యాగ్ పోయిందని మరికొన్ని రోజులు.. ఇలా ప్రతిరోజూ వార్తల్లో నిలవాలని కోరుకుంటుంది ఈ కుర్ర భామ. అయితే తాజాగా డేటింగ్ రూమర్‌తో హెడ్ లైన్స్ టచ్ చేసింది. అవును.. ఊర్వశీ హర్యానా మాజీ ఎమ్మెల్యే గోపాల్ కందాతో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి.
సింగపూర్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఈ వివాదాస్పద రాజకీయ నాయకుడితో భోజనం చేస్తూ కనిపించింది హీరోయిన్. లంచ్ చేస్తూ క్లోజ్‌గా ముచ్చటించుకుంటుండగా.. ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేశాడు. దీంతో ఈ విషయంపై రచ్చ రచ్చ అవుతోంది. కొందరు డేటింగ్ అంటుంటే.. ఇంకొందరు క్యాజువల్ మీటింగ్ అయ్యుండొచ్చని.. అసలు పొంతన లేకుండా వీళ్లు కలవడమేంటని.. ఇలా రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. కాగా గోపాల్ స్వతంత్ర అభ్యర్థిగా సిర్సా నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచాడు. ఆ తర్వాత బీజేపీలో చేరాడు.






