హీరోతో మృణాల్‌ డేటింగ్...చాట్ లిస్ట్ లీక్ ?

by velandi.Saikiran |

హీరో ధనుష్ తో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డేటింగ్ లో ఉన్నట్లు చాలా రోజుల నుంచి ప్రచారమైతే సాగుతోంది.

హీరోతో మృణాల్‌ డేటింగ్...చాట్ లిస్ట్ లీక్ ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే పాపులారిటీని దక్కుతుంది. అలాంటి వారిలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఒకరు. బాలీవుడ్ లో బాగా రాణిస్తున్నప్పటికీ, సీతా రామంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మృణాల్ ఠాకూర్. ఈ సినిమాలో చీర కట్టుతో మెరిసిన మృణాల్ ఠాకూర్, ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు. వరుస అవకాశాలతో దక్కించుకుంటూ ముందుకు వెళ్తోంది. అయితే అలాంటి హీరోయిన్ మృణాల్ ఠాకూర్, పెళ్లయిన హీరోతో డేటింగ్ లో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

హీరో ధనుష్ తో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డేటింగ్ లో ఉన్నట్లు చాలా రోజుల నుంచి ప్రచారమైతే సాగుతోంది. దీనిపై ఈ ఇద్దరు ఎక్కడ స్పందించలేదు. అయితే వీళ్ళ డేటింగ్ గురించి మరో సంచలన విషయం బయటకు వచ్చింది. వీరిద్దరూ చాటింగ్ చేసుకున్న లిస్టు వైరల్ గా మారింది. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ 'దో దివానే షెహర్‌ మే' సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. అయితే ఈ టీజర్ ను ఇన్ స్టాలో మృణాల్ పోస్ట్ చేశారు. దీనిపై హీరో ధనుష్ రియాక్ట్ అయ్యారు. చాలా బాగుంది అని అర్థం వచ్చేలా ధనుష్ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే లవ్ సింబల్ తో హీరోయిన్ మృణాల్ రిప్లై ఇచ్చారు. దీంతో ధనుష్, మృణాల్ డేటింగ్ నిజమేనని సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. క్లిక్

Next Story