చెరొక పార్ట్‌నర్‌ను వెతుక్కున్న హృతిక్, అతని మాజీ భార్య?

by Web Desk |
చెరొక పార్ట్‌నర్‌ను వెతుక్కున్న హృతిక్, అతని మాజీ భార్య?
X

దిశ, సినిమా : బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్, అతని మాజీ భార్య సుస్సానే ఖాన్ డేటింగ్ రూమర్స్‌తో వార్తల్లో నిలిచారు. ఇటీవలే ముంబైలోని జపనీస్ రెస్టారెంట్‌కు క్యాజువల్ డిన్నర్‌ కోసం వచ్చిన హృతిక్.. మిస్టరీ గర్ల్ ఫ్రెండ్‌తో మీడియా కంటికి చిక్కాడు. డిన్నర్ తర్వాత ఆమె చేయి పట్టుకుని రెస్టారెంట్ నుంచి బయటిరావడం కనిపెట్టిన ఫొటోగ్రాఫర్స్.. ఆ లేడీ ఐడెంటిటీ తెలుసుకునేందుకు ప్రయత్నించినా మాస్క్ ధరించడంతో వీలు కాలేదు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమె ఎవరో తెలుసుకునే పనిలో పడ్డారు. అయితే చాలాకాలం నుంచి సింగిల్‌గా ఉంటున్న హృతిక్.. ఈ మిస్టరీ గర్ల్‌తో డేటింగ్‌‌లో ఉన్నాడేమోనని చెవులు కొరుక్కుంటున్నారు.

మరోవైపు అతని మాజీ వైఫ్ సుస్సానే సైతం నటుడు అర్సలన్ గోనితో డేటింగ్‌లో ఉందని కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. పార్టీలు, ఫంక్షన్లలో వీరిద్దరూ జంటగా కనిపించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జుహూలోని ఓ రెస్టారెంట్‌లో డిన్నర్ డేట్‌‌లో పాల్గొన్న జంట.. చేతిలో చెయ్యేసుకుని సన్నిహితంగా మెలగడం తమ రిలేషన్‌షిప్‌ను కన్‌ఫర్మ్ చేస్తోంది. అయితే ఇంతవరకు అఫీషియల్‌గా ప్రకటించలేదు.




Next Story