‘కట్టలాన్’ ట్రైలర్ రిలీజ్‌కు తేదీ ఖరారు..

by Mallepaka Hamsa |

ఈ క్రేజీ మూవీ ట్రైలర్‌ను ఏప్రిల్ 15న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

‘కట్టలాన్’ ట్రైలర్ రిలీజ్‌కు తేదీ ఖరారు..
X

దిశ, సినిమా: మలయాళ నటుడు ఆంటోనీ వర్గీస్, దర్శకుడు పాల్ జార్జ్ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘కట్టలాన్’. ఈ చిత్రాన్ని క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ సుమారు రూ. 45 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇందులో ఆంటోనీ వర్గీస్ సరసన దుషారా విజయన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే టాలీవుడ్ నటుడు సునీల్, సీనియర్ యాక్టర్ జగదీష్, కబీర్ దుహాన్ సింగ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇంతమంది స్టార్స్ ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం మే 14న పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ తాజాగా ఒక వైల్డ్ పోస్టర్‌‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఆంటోనీ వర్గీస్ చేయి మొత్తం రక్తంతో తడిసి ఉండటం, పక్కనే ఉన్న ఒక ఏనుగు బొమ్మపై పెట్టగా.. దానిపై నుంచి రక్తం కారుతూ ఉండటం చూస్తుంటే సినిమా ఎంత వయొలెంట్‌గా ఉండబోతోందో అర్థమవుతోంది. ఈ క్రేజీ మూవీ ట్రైలర్‌ను ఏప్రిల్ 15న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అడవి నేపథ్యంలో సాగే ఈ రివెంజ్ డ్రామాలో ఆంటోనీ వర్గీస్ మరోసారి తన మాస్ నటనతో మెప్పించడానికి సిద్ధమయ్యారు. ముఖ్యంగా సునీల్ పాత్ర ఈ సినిమాలో ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రేపు రాబోయే ట్రైలర్‌తో సినిమా కథపై మరింత స్పష్టత రానుంది.

Next Story