పక్కా మాస్ యాక్షన్ మూవీగా ‘దాషమకాన్’.. పవర్ ఫుల్ పోస్టర్ విడుదల

by Mallepaka Hamsa |

వైవిధ్యమైన సినిమాలో ఆక‌ట్టుకుంటోన్న యంగ్ హీరో హ‌రీష్ క‌ళ్యాణ్(Harish Kalyan) క‌థానాయ‌కుడుగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘దాషమకాన్’(dashmakan).

పక్కా మాస్ యాక్షన్ మూవీగా ‘దాషమకాన్’.. పవర్ ఫుల్ పోస్టర్ విడుదల
X

దిశ, సినిమా: వైవిధ్యమైన సినిమాలో ఆక‌ట్టుకుంటోన్న యంగ్ హీరో హ‌రీష్ క‌ళ్యాణ్(Harish Kalyan) క‌థానాయ‌కుడుగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘దాషమకాన్’(dashmakan). ఐడీఏఏ ప్రొడ‌క్షన్స్‌, థింక్ స్టూడియోస్ బ్యాన‌ర్స్‌పై ఈ మాస్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను వినీత్ వ‌ర‌ప్రసాద్ స్వీయ ద‌ర్శక నిర్మాణంలో రూపొందిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో రాబోతున్న ఈ సినిమా టైటిల్ ప్రోమోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. టైటిల్ ప్రోమోను గ‌మ‌నిస్తే.. ఊర్లో పేరు మోసిన రౌడీకి చెందిన కిరాయి మ‌నుషులు హీరోని వెతుక్కుంటూ.. ఎలాగైనా చంపాల‌ని ఆయుధాల‌తో వెంబ‌డిస్తుండగా.. హీరో బాత్రూమ్‌లో ఒక‌డ్ని వేసేసి తాపీగా బ‌య‌ట‌కు న‌డుచుకుని వ‌స్తాడు.

దీంతో రౌడీలు బిక్క చ‌చ్చిపోతారు. ఈ సీన్స్‌తో టైటిల్ ప్రోమో ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ప‌క్కా మాస్ యాక్షన్ మూవీగా క‌నిపిస్తోంది. ఈ సినిమాలో హీరో పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయ‌నేది తెలుస్తోంది. ఓ షేడ్‌లో పాట‌లు పాడితే.. మ‌రో షేడ్‌లో మాస్ అవ‌తార్‌లో యాక్షన్‌తో దుమ్మురేపుతుంటాడని సమాచారం. హ‌రీష్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న ప్రీతి ముకుంద‌న్ (Preity Mukhundhan)క‌థానాయిక‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో స‌త్య‌రాజ్‌,సునీల్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. బ్రిట్టో మైకేల్ సంగీతాన్నిఅందిస్తుండ‌గా కార్తీక్ అశోకన్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను త్వరలోనే తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలిపారు.

Next Story