- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయ్ వర్మతో దంగల్ బ్యూటీ డేటింగ్.. ఈ విషయం అందరికీ చెప్పాలని డిసైడ్ అయ్యానంటూ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఫాతిమా సనా షేక్(Fatima Sana Shaikh) ‘దంగల్’ సినిమాతో ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఫాతిమా సనా షేక్(Fatima Sana Shaikh) ‘దంగల్’ సినిమాతో ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. ఇక ఇటీవల ఈ అమ్మడు ‘హౌస్‌ఫుల్-5’ మూవీలోనూ నటించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ‘మెట్రో ఇన్ డినో’ (Metro in Dino)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే హాధవన్ సరసన ‘ఆప్ జైసా కోయ్’(Aap Jaisa Koi) అనే ఓటీటీ చిత్రంలోనే నటిస్తోంది. ఈ మూవీ జూలై 11న నెటిఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇదిలా ఉంటే.. ఫాతిమా పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ అమ్మడు ఇటీవల తమన్నా భాటియా భాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ(Vijay Verma)తో క్లోజ్‌గా కనిపించిడంతో వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.
దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు తమన్నాకు అన్యాయం జరిగిందంటూ ఫాతిమాను దారుణంగా తిడుతున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు రిలేషన్‌షిప్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘ప్రేమలో ఉన్న ఇద్దరు సమాన గౌరవం ఇచ్చి పుచ్చుకుంటే బంధం సంతోషంగా ఉంటుంది. ఒకరు చెప్పేది మరొకరు వినాలి. కొన్నిసార్లు పార్ట్‌నర్ కోసం కాంప్రమైజ్ కూడా అవ్వాలి. మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా బంధాన్ని నిలబెట్టుకోవాలి. అప్పుడే జీవితం విజయవంతంగా కొనసాగుతుంది. నాకు ఇప్పటివరకు అలాంటి వ్యక్తి కనిపించలేదు. మంచివాళ్లు కేవలం సినిమాల్లోనే ఉంటారు. అలాగే మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు మూర్ఛ రోగం ఉంది. అమెరికా వెళ్తున్నప్పుడు విమానంలో ఉండగా రావడంతో ఎయిర్‌పోర్ట్ సిబ్బంది హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్స అందించారు. అయినా తగ్గకపోవడంతో ఎక్కువ డోస్ ఇచ్చారు. అందుకే నా శరీరం ఎఫెక్ట్ అయి బెడ్‌రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక ఈ సమయంలోనూ రెండు సినిమాలు చేయాల్సి ఉండగా.. షూటింగ్ క్యాన్సిల్ చేశాను. కానీ టీమ్ రమ్మని పిలవడంతో నా బాధను తట్టుకోలేక ఏడ్చేశా. అప్పుడు నాకున్న మూర్ఛ రోగం గురించి అందరికీ చెప్పాలని డిసైడ్ అయి చెప్పేశాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతున్నారు. అలాగే మాధవన్‌తో కలిసి నటించడంపై ఆమె మాట్లాడుతూ.. ఈ సినిమా కథ నాకు బాగా నచ్చింది. ఇది నిజాయితీగల స్టోరీ. ఈ ప్రేమకథలో చాలా వేరియేషన్స్ ఉన్న పాత్రను నేను ఎప్పుడూ పోషించలేదు. మాధవన్‌తో కలిసి పనిచేయడానికి ఎవరు ఇష్టపడరు? కానీ నాకు ఆయనతో పనిచేయడం సూపర్ ఎక్జైటింగ్‌గా ఉంది’’ అని చెప్పింది.






