ఇన్నాళ్లకు నా కల నెరవేరింది.. ‘చంద్రముఖి-2’ హీరోయిన్

by Disha Web Desk 10 |
ఇన్నాళ్లకు నా కల నెరవేరింది.. ‘చంద్రముఖి-2’ హీరోయిన్
X

దిశ, సినిమా: మలయాళ బ్యూటీ మహిమా నంబియార్‌ గురించి పరిచయం అక్కర్లేదు. తన 13 ఏళ్ల సీని కెరీర్‌లో నటించింది తక్కువ సినిమాలైనా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా ప్రస్తుతం ‘చంద్రముఖి- 2’ చిత్రంతో తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రజనీకాంత్‌ పాత్రలో రాఘవ లారెన్స్ నటించగా బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ జ్యోతిక పాత్రలో నటించింది. లక్ష్మీ మీనన్‌, సృష్టి డాంగే, రాధిక శరత్‌ కుమార్‌, వడివేలుతో పాటు మహిమ నంబియార్‌ ఓ కీలక పాత్ర పోషించింది. అయితే ఈ మూవీలోని ఓ పాట చిత్రీకరణ కోసం జార్జియా వెళ్తున్నట్లు మహిమా నంబియార్‌ తన ట్విట్టర్‌లో పేర్కొంది. ‘ఒక నటిగా లారెన్‌న్స్‌ మాస్టర్‌తో కలిసి డాన్స్‌ చేయాలన్నది నా చిరకాల కోరిక. అది ఇప్పుడు నెరవేరడం సంతోషంగా ఉంది’ అంటూ సంబరపడిపోతుంది.

Read More: టర్కీలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న బాలీవుడ్ నటి.. ప్రియుడితో దిగిన బ్యూటీఫుల్ పిక్స్ వైరల్

Next Story

Most Viewed