తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాలు విడుదల.. నూతన అధ్యక్షుడు ఎవరంటే..?

by Satheesh |   (  Updated:2023-02-19 12:00:10  IST  )

తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా దామోదరప్రసాద్ ఎన్నికయ్యారు. ఆదివారం నిర్వహించిన తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో జెమిని కిరణ్‌పై 17 ఓట్ల తేడాతో దామోదరప్రసాద్ విజయం సాధించారు.

తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాలు విడుదల.. నూతన అధ్యక్షుడు ఎవరంటే..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా దామోదరప్రసాద్ ఎన్నికయ్యారు. ఆదివారం నిర్వహించిన తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో జెమిని కిరణ్‌పై 17 ఓట్ల తేడాతో దామోదరప్రసాద్ విజయం సాధించారు. మొత్తం 1134 ఓట్లు ఉండగా.. 677 ఓట్లు పోలయ్యాయి. అందులో దామోదర ప్రసాద్‌కు 339 ఓట్లు రాగా.. జెమిని కిరణ్‌కు 322 ఓట్లు వచ్చాయి. ఇక ఉపాధ్యక్షులుగా అశోక్ కుమార్, సుప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నిర్మాతల మండలి కార్యదర్శులుగా ప్రసన్నకుమార్, వైవీఎస్ చౌదరి ఎన్నికవ్వగా.. జాయింట్ సెక్రటరీలుగా భరత్ చౌదరి, నట్టి కుమార్ ఎన్నికయ్యారు. నిర్మాతల మండలికి సాధారణంగా షెడ్యూల్‌ ప్రకారం ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలి. కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించలేదు. అయితే కొన్ని రోజుల క్రితం నిర్మాతలు ఎన్నికలు నిర్వహించాలని ఆందోళన చేసిన నేపథ్యంలో నేడు హైదరాబాద్‌లో ఎన్నికలు నిర్వహించారు.

Also Read...

'మిస్టర్ కింగ్‌'ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు: మేకర్స్

Next Story