- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దక్ష రహస్యాలను బయటకు తీసుకురాబోతుంది.. ‘NC-24’ నుంచి హీరోయిన్ పోస్టర్ రిలీజ్
అక్కినేని నాగచైతన్య(Akkineni Nagachaitanya) ఇటీవల ‘తండేల్’ సినిమాతో హిట్ అందుకుని.. త్వరలో ‘NC-24’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Akkineni Nagachaitanya) ఇటీవల ‘తండేల్’ సినిమాతో హిట్ అందుకుని.. త్వరలో ‘NC-24’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కార్తీక్ దండు దర్శకత్వంలో రాబోతున్న ఈ ప్రేజ్టీయస్ ప్రాజెక్ట్‌గా ‘వీరూపాక్ష’తో హిట్ అందుకున్న శ్రీవెంకటేశ్వర సినిమాస్, సుకుమార్ వ్రైటింగ్స్ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ‘వృషభ కర్మ’ అనే టైటిల్ ఫిక్స్ చేసే పనిలో చిత్రబృందం ఉంది. ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా? అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలోనే.. మూవీ మేకర్స్ ఇందులోంచి హీరోయిన్ పోస్టర్‌ను షేర్ చేయనున్నట్లు ప్రకటించి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. కానీ చేవెళ్ల బస్సు ప్రమాదంలో ఏకంగా 21మంచి ప్రాణాలు కోల్పోవడంతో చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
తాజాగా, ‘NC-24’ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చి నాగచైతన్య అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. గత కొద్ది కాలంగా ఈ చిత్రంలో నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhury)హీరోయిన్‌గా నటిస్తున్నట్లు వస్తున్న వార్తలను నిజం చేస్తూ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక మీనాక్షి ‘దక్ష’ (daksha)పాత్రలో నటిస్తున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. గుహల్లో ఉన్న మీనాక్షి బ్లాక్ షర్ట్ ధరించి స్పెడ్స్ పెట్టుకుని చేతులకు రక్తం వస్తున్నప్పటికీ పట్టించుకోకుండా.. భూతద్దంలో ఏదో చూస్తున్నట్లు కనిపించింది. చుట్టూ ఓ బ్యాగ్, పలు పని పరికరాలు ఉన్నాయి. ఇక ఈ పోస్ట్‌కు ‘‘దక్ష రహస్యాలు, నిజాలను వెలికితీస్తుంది.
‘NC-24’ ప్రపంచంలో మీనాక్షి చేరడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆమె ఈ చిత్రానికి అయస్కాంతంలా మారనుంది. ఈ నవంబర్‌లో మరిన్ని అప్‌డేట్‌లు రాబోతున్నాయి.. సిద్ధంగా ఉండండి’’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలాగే ఈ కాంబోలో ఇంతకుముందెన్నడూ సినిమా రాలేదు కాబట్టి చైతు, మీనాక్షి కెమిస్ట్రీ చూసేందుకు ఆతృతను ఆపుకోలేకపోతున్నామని అంటున్నారు. కాగా.. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో హిట్ అందుకున్న మీనాక్షి తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటోంది. ఊహించని హిట్ పడటంతో అమ్మడుకి కలిసొస్తుంది. స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు క్యూ కడుతున్నాయి.






