మోహన్ బాబు కన్నుమూత.. తీవ్ర విషాదంలో దగ్గుబాటి ఫ్యామిలీ

by Disha Web Desk 19 |
మోహన్ బాబు కన్నుమూత.. తీవ్ర విషాదంలో దగ్గుబాటి ఫ్యామిలీ
X

దిశ, వెబ్‌డెస్క్: దగ్గుబాటి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. హీరో దగ్గుబాటి వెంకటేష్, సురేష్ బాబు వాళ్ల బాబాయ్ దగ్గుబాటి మోహన్ బాబు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన.. ఆరోగ్యం విషమించడంతో ఇవాళ కారంచేడులోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. దగ్గుబాటి మోహన్ బాబు మరణవార్త తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మరణం పట్ల సంతాపం తెలుపుతున్నారు.

ఇక, బాబాయ్ మరణవార్త తెలుసుకున్న దగ్గుబాటి సురేష్ బాబు ప్రకాశం జిల్లాలోని కారంచేడుకు చేరుకుని బాబాయ్ పార్థివదేహానికి నివాళ్లు అర్పించారు. అయితే, హీరో వెంకటేష్ ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా ఔట్ డోర్‌లో ఉండటంతో ఆయన రేపు జరిగే అంత్యక్రియల్లో పాల్గొననున్నట్లు సమాచారం. అలాగే, హీరో రానా సైతం రేపు అంత్యక్రియల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed