- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'D56' అనేది ఒక పీరియాడికల్ ఫిల్మ్: మారి సెల్వరాజ్
‘D-56’ అనేది ఒక పీరియాడికల్ ఫిల్మ్. నేను మొదటిసారి ఫాంటసీని ప్రయత్నిస్తున్నాను.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush), దర్శకుడు మారి సెల్వరాజ్ (Mari Selvaraj)కాంబినేషన్‌లో ఒక భారీ సినిమా రాబోతోంది. ‘D-56’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు మారి సెల్వరాజ్ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ‘D-56’ అనేది ఒక పీరియాడికల్ ఫిల్మ్. నేను మొదటిసారి ఫాంటసీని ప్రయత్నిస్తున్నాను. రాజకీయాలతో నిండి ఉంటుంది. నేను తీసిన కర్ణన్, మామన్నన్ వంటి సినిమాల్లో కుల వివక్ష (కులాల మధ్య గొడవలు) గురించి చూపించా. అయితే, ఈ కొత్త సినిమాలో అసలు ఈ కులాల మధ్య విభజన ఎక్కడ మొదలైంది? గొడవలకు మూల కారణం ఏమిటి? అనే విషయాన్ని చూపించబోతున్నా.
హీరో ధనుష్ ఆ మూలాల వద్దకు వెళ్లి, ఇకపై ఎలాంటి గొడవలు జరగకుండా ఒకేసారి సమస్యను పరిష్కరిస్తారు’’ అని చెప్పుకొచ్చారు. అలాగే ఈ చిత్రం విషయంలో తనకు ధనుష్ ఓ మాట కూడా చెప్పారని వెల్లడించారు. ‘‘ఈ ప్రాజెక్ట్‌ను మా ఇద్దరి కెరీర్‌లలో అతిపెద్ద బడ్జెట్ చిత్రంగా నిర్మించాలని చెప్పారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అందుకే, గ్రాఫిక్స్, సెట్టింగ్స్ కోసం చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. సినిమా షూటింగ్ మొదలవ్వడానికి ముందే చేయాల్సిన పనులు చాలా ఉండటంతో, ప్రస్తుతం దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తానికి, కుల వివక్ష లేని సమాజాన్ని ఎలా చూడాలి? అనే ఒక మంచి సందేశాన్ని ఈ భారీ సినిమా ద్వారా ధనుష్ చెప్పబోతున్నారు’’ అని అన్నారు.






