- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు.. బాధితుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కోర్టు
టాలీవుడ్‌లో స్టార్ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న జానీ మాస్టర్ ప్రజెంట్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: టాలీవుడ్‌లో స్టార్ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న జానీ మాస్టర్ ప్రజెంట్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. తనను జానీ మాస్టర్ లైంగికంగా వేధింపులకు గురిచేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదులో జానీ మాస్టర్ తనను కోరిక తీర్చాలని వేధించినట్లు, కోరిక తీర్చకపోతే ఆఫర్లు లేకుండా చేస్తానని, తనను పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ తనపై ఒత్తిడి చేసినట్లు పేర్కొంది. ప్రజెంట్ ఈ ఇష్యూ హాట్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారడంతో.. ప్రింట్ మీడియా/ డిజిటల్ మీడియా/ ఎలక్ట్రానిక్ మీడియాలకు సుప్రీం కోర్ట్ ఓ కీలక ఆదేశం జారీ చేసినట్లు తెలుస్తుంది. సుప్రీం కోర్ట్ మార్గదర్శకాల ప్రకారం ఈ సమస్య పరిష్కరించబడే వరకు సంబంధిత వ్యక్తులకు సంబంధించిన ముసుగులు లేని ఫొటోగ్రాఫ్‌లను, వీడియోలను ఉపయోగించవద్దు అని.. ఏదైనా ఉపయోగించినట్లైతే వాటిని వెంటనే తీసివేయమని తెలిపారు.
Read More...






