విజయ్ ‘లియో’పై క్రిటిక్ రివ్యూ.. ట్వీట్ వైరల్

by Disha Web Desk 7 |
విజయ్ ‘లియో’పై క్రిటిక్ రివ్యూ.. ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘లియో’. ఎన్నో వివాదాల నడుమ నేడు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ మూవీపై రివ్వూలు రాగా.. తనకు తాను సినీ క్రిటిక్‌గా చెప్పుకునే ఉమైర్ సంధూ కూడా తనదైన స్టైల్లో ఈ మూవీకి రివ్వూ ఇచ్చాడు. ఈ మేరకు.. ‘షార్ట్ రివ్యూ లియో : ఇది ఔట్ అండ్ అవుట్ విజయ్ ఫ్లిక్. ఇందులో అతను ఫెర్ఫార్మెన్స్ వన్ మ్యాన్ షోగా ఉంటుంది. చిత్రం సాధారణ కథాంశాన్ని కలిగి ఉన్నప్పటికీ, అది ఆకట్టుకునే డ్రామా, యాక్షన్‌తో అద్భుతంగా అలరించింది. టెన్షన్, యాక్షన్, ఎమోషన్ యొక్క సరైన మిక్స్‌ను ఒకే షో లో చూడొచ్చు’’ అంటూ చెప్పుకొస్తూ.. సినిమాకు 3.5/5 రేటింగ్ ఇచ్చాడు.

Next Story

Most Viewed