- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mrithyunjay Review: క్రైమ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?
ఈ సినిమాలో అనవసరమైన రొమాంటిక్ సాంగ్స్ లేదా కామెడీ ట్రాక్స్ పెట్టకుండా కేవలం కథ మీదనే ఫోకస్ పెట్టడం మంచి విషయం. కాల భైరవ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్‌గా ఉండి.. సీన్స్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.

దిశ, సినిమా: వరుస విజయాలతో ‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’గా పేరు తెచ్చుకున్న శ్రీవిష్ణు, ‘విష్ణు విన్యాసం’ విడుదలైన వారం రోజులకే ‘మృత్యుంజయ్’ అనే సీరియస్ క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రాన్ని శ్రీ హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించగా.. రెబా మోనికా జాన్, వీర్ ఆర్యన్, బేబీ ఊహా, సుదర్శన్ కీలక పాత్రలో కనిపించారు. సందీప్ గుర్రం, వినయ్ చిలకపాటి నిర్మించగా.. కాళ భైరవ సంగీతం అందించారు. ఈ సినిమా మార్చి 6న థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంటోంది. ఇక ‘మృంత్యుంజయ్’ కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో జయ్ అలియాస్ ‘మృత్యుంజయ్’ అనే పాత్రలో శ్రీవిష్ణు నటించారు. ‘స్వేచ్ఛ’ అనే వార్తాపత్రికలో మరణవార్తల అడ్వర్టైజ్‌మెంట్స్ సేకరించే పని చేసే జయ్‌కు క్రైమ్ బ్యూరోలో చేరాలని ఆశ ఉంటుంది. ఒకరోజు ఒక మరణవార్త యాడ్ కోసం వెళ్లినప్పుడు, ఆ చావు వెనుక ఏదో మిస్టరీ ఉందని గ్రహించిన జయ్.. దానిపై సొంతంగా విచారణ మొదలుపెడతాడు.
ఈ క్రమంలో ఒక పవర్‌ఫుల్ వ్యక్తితో తలపడాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలే ఈ చిత్రం కథ. సాధారణంగా కామెడీ సినిమాలతో నవ్వించే శ్రీవిష్ణు, ఈ సినిమాలో చాలా సీరియస్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. హీరోకు దీటుగా విలన్ పాత్రను డిజైన్ చేయడం, సెకండాఫ్‌లో వీరిద్దరి మధ్య సాగే ‘మైండ్ గేమ్’ చిత్రానికి హైలెట్‌గా నిలిచింది. అలాగే పోలీస్ ఆఫీసర్‌గా రెబా మోనికా జాన్ తన నటనతో, యాక్షన్ సీన్స్‌తో ఆకట్టుకుంది. ఈ సినిమాలో అనవసరమైన రొమాంటిక్ సాంగ్స్ లేదా కామెడీ ట్రాక్స్ పెట్టకుండా కేవలం కథ మీదనే ఫోకస్ పెట్టడం మంచి విషయం. కాల భైరవ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్‌గా ఉండి.. సీన్స్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. పాయింట్ కొత్తదేమీ కాకపోయినా, దర్శకుడు శ్రీ హుస్సేన్ షా కిరణ్ హీరో-విలన్ మధ్య పోరాటాన్ని ఆసక్తికరంగా మలిచారు. శ్రీవిష్ణు తన జోనర్ మార్చి చేసిన ఈ ప్రయత్నం మొత్తానికి ప్రేక్షకులను మెప్పించి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటోంది. అయితే ఈ సినిమా సోషల్ మీడియాలో 3.5 రేటింగ్‌ను దక్కించుకుంది.






