- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటీటీలోకి రాబోతున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీపై అధికారిక ప్రకటన విడుదల
వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal)ఇటీవల క్రైమ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’(Aaryan)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

దిశ, సినిమా: వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal)ఇటీవల క్రైమ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’(Aaryan)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో తెలుగమ్మాయి మానస చౌదరి హీరోయిన్గా నటించగా.. శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath) ప్రధాన పాత్రలో కనిపించింది. ప్రవీణ్. కె దర్శకత్వంలో వచ్చిన ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ అక్టోబర్ 21న తమిళ భాషలో విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుని. ఇక తెలుగులో ఈ చిత్రాన్ని వారం తర్వాత అక్టోబర్ 27న టాలీవుడ్ హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి రిలీజ్ చేయగా.. ఇక్కడ కూడా హిట్ అందుకోలేకపోయింది. సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ రాబట్టుకోలేకపోయింది.
ఓ చనిపోయిన వ్యక్తి హత్యలు చేస్తుండగా.. ఈ కేసును పోలీస్ అధికారిక అయిన హీరో విష్ణు విశాల్‌కు అప్పగిస్తారు. ఆ వ్యక్తి చనిపోయినా ఎలా హత్య చేస్తాడు?అదేలా సాధ్యం అయింది అనేది ఇందులో చూపించారు. అయితే కథ ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికీ భారీ అంచనాల మధ్య విడుదలై.. విజయం సాధించలేకపోయింది. నెలరోజులకే ఆర్యన్ డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ విష్ణు విశాల్ స్టూడియోస్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఈ సినిమా ఓటీటీ హక్కులకు ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. నవంబర్ 28 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలిపారు. కాగా ప్రస్తుతం విష్ణు ‘గట్ట కుస్తీ’ సీక్వెల్ చేస్తున్నారు. దీంతో పాటు పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.
READ MORE ....
సౌత్ సినిమాలకు భారీ షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్.. ఆ సినిమాలు కొనకూడదని నిర్ణయం






