సుధీర్ బాబు ‘మామ మశ్చీంద్ర’ నుంచి క్రేజీ అప్డేట్‌!

by Disha Web Desk 9 |
సుధీర్ బాబు ‘మామ మశ్చీంద్ర’ నుంచి క్రేజీ అప్డేట్‌!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులలో హీరో సుధీర్ బాబు ఒకరు. ఈ హీరో సినిమాల విషయంలో ఆచితూచి అడుగు వేస్తాడు. ప్రతిసారి విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు. ప్రస్తుతం సుధీర్ బాబు.. ప్రస్తుతం హర్హ వర్ధన్ దర్వకత్వంలో వస్తోన్న ‘మామ మశ్చీంద్ర’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇకపోతే సుధీర్ తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా నటించని విధంగా ఈ సినిమాలో మూడు విభిన్నమైన రోల్స్‌లో మెరవనున్నాడు.

ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లను ఇప్పటికే చిత్ర బృందం రిలీజ్ చేయగా.. జనాల నుంచి మంచి రెస్పాన్స్ కూడా లభించింది. తాజాగా ఈ సినిమా బృందం ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్‌ను ప్రకటించింది. ఈ మూవీ బుకింగ్స్‌ను ఓపెన్ చేసినట్లు ఆఫిషీయల్‌గా అనౌన్స్ చేశారు. కాగా సినిమా బుకింగ్స్‌కు జనాల నుంచి ఏ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి. ఇక ఈ చిత్రం అక్టోబర్ 6 వ తారీకున విడుదల కానుంది.



Next Story

Most Viewed