శంకర్ - రామ్ చరణ్ సినిమా నుంచి క్రేజీ అప్డేట్

by Disha Web |
శంకర్ - రామ్ చరణ్ సినిమా నుంచి  క్రేజీ అప్డేట్
X

దిశ, వెబ్ డెస్క్ : RRR సినిమాతో రామ్ చరణ్ సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రకు ప్రాణం పోశాడు. అంతే కాకుండా RRR సినిమా ఆస్కార్ నామినేషన్స్ కూడా నిలిచింది. నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్ వరకు తీసుకెళ్లింది. ప్రస్తుతం రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర కొడుతోంది. సినిమా షూటింగ్ కూడా శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలోని ఒక పాట హైదరాబాద్ లోని పాతబస్తీలో షూట్ చేయనున్నారని తెలిసిన సమాచారం. తెలుగు సినీ పరిశ్రమలో ఈ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది.

ఇది మాత్రమే కాకుండా ఈ సినిమా నుంచి ఇంకో క్రేజీ అప్డేట్ కూడా వచ్చింది. రామ్ చరణ్ తో పాటు మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నారని టాలీవుడ్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, చరణ్ సినిమాలో ముఖ్య మైన పాత్రలో నాట్టిస్తున్నాడట . కాకపోతే ఉపేంద్ర సెకండాఫ్‌లో కనిపిస్తారని తెలుస్తోంది. త్వరలో ఈ విషయం పై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వనున్నారట.Next Story