Bhola Shankar : మెగాస్టార్ ‘భోళా శంకర్‌’ నుంచి క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌కు పండగే!

by Hamsa |
Bhola Shankar : మెగాస్టార్ ‘భోళా శంకర్‌’ నుంచి క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌కు పండగే!
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘భోళాశంకర్’. ఇందులో కీర్తి సురేష్ చిరుకి చెల్లిగా నటిస్తుండగా.. ఆమెకు జోడీగా హీరో సుశాంత్ నటిస్తున్నాడు. దీనిని డైరెక్టర్ మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కాగా, ‘భోళాశంకర్’ ఆగస్టు 11న థియేటర్స్‌లో విడుదల కానుంది. తాజాగా, డైరెక్టర్ మెహర్ రమేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడు. రేజ్ ఆఫ్ భోళా మెగా రాప్ యాన్తమ్ వచ్చేస్తుందని ఓ పోస్టర్‌ను వదిలాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Read More: పాక్ మహిళ సీమా హైదర్‌కు సినిమాలో చాన్స్

Next Story