- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్రివిక్రమ్-వెంకీ మామ సినిమాకు క్రేజీ టైటిల్..!
అబ్బాయిగారు 60 ప్లస్ టైటిల్ పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్. సినిమాలో కూడా విక్టరీ వెంకటేష్ వయస్సు చుట్టూ కథ

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ మంచి ఫామ్ లో కనిపిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా గత సంక్రాంతి కానుకగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇండస్ట్రీని మొత్తం షేక్ చేసింది. దీంతో తన తర్వాతి ప్రాజెక్టులపై చాలా గ్యాప్ తీసుకొని ముందుకు వెళ్తున్నాడు విక్టరీ వెంకటేష్.
ఇందులో భాగంగానే ఇప్పుడు త్రివిక్రమ్ తో విక్టరీ వెంకటేష్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం జరిగింది. ఇప్పటికే వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ అలాగే మల్లీశ్వరి సినిమాకు డైలాగ్స్ రాశారు త్రివిక్రమ్. ఈ రెండు సినిమాలు బంపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు వెంకటేష్ తో తన దర్శకత్వంలో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ అని తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ పై అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమాకు ఆనందరావు అనే టైటిల్ ముందుగా అనుకున్నారట. ఆ తర్వాత ఆనంద నిలయం అని కూడా పెడితే బాగుంటుందని త్రివిక్రమ్ ప్లాన్ చేశారట. కానీ ఇప్పుడు వెంకటేష్ వయస్సు టైటిల్ లో వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అబ్బాయిగారు 60 ప్లస్ అనే టైటిల్ పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. సినిమాలో కూడా విక్టరీ వెంకటేష్ వయస్సు చుట్టూ కథ నడుస్తుందట. అందుకే అబ్బాయిగారు 60 ప్లస్ అని పెట్టాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై అతి త్వరలోనే ప్రకటన రానున్నట్లు చెబుతున్నారు.






