- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుష్ఫ2 నుంచి క్రేజీ ఫోటో లీక్.. ఎర్రటి చీరలో అదిరిపోయిన శ్రీవల్లి!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన నటకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇక సుకుమార్ దర్శకత్వంలో 2021లో తెరకెక్కిన పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో ఎంత పెద్ద హిట్ అందుకుందో

దిశ, సినిమా : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన నటకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇక సుకుమార్ దర్శకత్వంలో 2021లో తెరకెక్కిన పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో ఎంత పెద్ద హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2 మూవీ షూటింగ్‌లో చాలా బిజీగా ఉన్నారు.
బన్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. దీంతో పుష్ప2 మూవీకి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా సరే ఫ్యాన్స్‌కు పండుగే అవుతోంది.
అయితే తాజాగా సోషల్ మీడియాలో పుష్ప2కి సంబంధించిన ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఎర్రటి చీరలో ఒంటి నిండా నగలు వేసుకొని ఉన్న రష్మిక ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇక దీన్ని చూసిన వారందరూ, పుష్ప2లో రష్మిక మందన ఫోటో లీక్ అయ్యింది. ఎర్ర చీరలో పుష్పరాజ్ గాడి భార్య అదిరిపోయిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఫోటో నిజంగానే పుష్ప2 సెట్స్ నుంచి లీక్ అయిందా? లేకపోతే వేరే ఏదైనా ఆడ్ ఫిలిం కి సంబంధించిందా తెలియాల్సి ఉంది.






