- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెంకటేష్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌లో క్రేజీ బ్యూటీ.. బర్త్ డే విషెస్ తెలుపుతూ స్పెషల్ ప్రకటన
కన్నడ హీరోయిన్ శ్రీనిధి శెట్టి(Srinithi Shetty) ‘కేజీఎఫ్’ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుని క్రేజ్‌ను మరింత పెంచుకుంది.

దిశ, సినిమా: కన్నడ హీరోయిన్ శ్రీనిధి శెట్టి(Srinithi Shetty) ‘కేజీఎఫ్’ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుని క్రేజ్‌ను మరింత పెంచుకుంది. ఇక తెలుగులో హిట్-3, తెలుసు కదా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ప్రస్తుతం తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో భారీ ప్రాజెక్ట్స్ అందుకుంటూ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. నేడు శ్రీనిధి శెట్టి పుట్టినరోజు కావడంతో.. మరో సినిమాలో జాయిన్ అయినట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. విక్టరీ వెంకటేష్(Venkatesh), త్రివిక్రమ్(Trivikram) కాంబోలో రాబోతున్న చిత్రంలో శ్రీనిధి హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది. ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతూ.. ఫొటోను షేర్ చేశారు. అలాగే ఈ ప్రయాణంలో భాగం అయినందుకు శ్రీనిధికి స్వాగతం చెప్పారు. ‘‘గార్జియల్, గ్రేస్‌ఫుల్ బ్యూటీ మా ప్రాజెక్ట్‌లో జాయిన్ కావడం ఎక్జైటింగ్‌గా ఉంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఈ సినిమాను హారికా హాసిన్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్‌లో 8వ ప్రాజెక్ట్‌గా రాబోతోంది.






