Niharika: నిహారిక కొత్త సినిమాలో క్రేజీ బ్యూటీ ఫిక్స్.. కీలక ప్రకటన విడుదల

by Mallepaka Hamsa |

మెగా డాటర్ నిహారిక(Niharika) యాంకర్‌గా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది.

Niharika: నిహారిక కొత్త సినిమాలో క్రేజీ బ్యూటీ  ఫిక్స్.. కీలక ప్రకటన విడుదల
X

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక(Niharika) యాంకర్‌గా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. కానీ అనుకున్నంత క్రేజ్ సంపాదించుకోలేకపోయింది. ప్రస్తుతం నిహారిక నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఈ అమ్మడు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన మొదటి మూవీ ‘కమిటి కుర్రోళ్లు’ (Committee Kurrollu)ఘన విజయం సాధించింది. ఇక మొదటి ప్రాజెక్ట్‌తో లాభాలు పొందిన నిహారిక నిర్మాతగా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం నిహారిక తన రెండో ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘ప్రొడక్షన్-2’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంగీత్ శోభన్(Sangeet Shobhan) హీరోగా నటిస్తున్నాడు. దీనికి నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. మానస శర్మ దర్శకత్వంలో రాబోతుంది. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఈ ఏడాదిలోనే విడుదల కానుంది.

తాజాగా, ఈ సినిమాలో హీరోయిన్‌ను ఫిక్స్ చేసినట్లు మూవీ టీమ్ ప్రకటించారు. ఇందులో నయన్ సారిక, సంగీత్ శోభన్ సరసన నటించనున్నట్లు వెల్లడించింది. ఆమెకు వెల్‌కమ్ చెప్తూ చిత్రబృందం ఫొటోను షేర్ చేశారు. త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ విషయాన్ని నయన్ సారిక కూడా ఇన్‌స్టా ద్వారా రివీల్ చేసింది. ‘‘మళ్లీ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. నిహారిక మేడమ్‌కు ధన్యవాదాలు’’ అనే క్యాప్షన్ జత చేసింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా, నయన్ సారిక ఆయ్, క వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. తెలుగులో ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఊహించని విధంగా క్రేజ్‌ను సొంతం చేసుకుని వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ ఫామ్‌లో ఉంది.

link

Next Story