సొమ్ము కోసం బిగ్‌బాస్‌పై ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారేమో: సీపీఐ నారాయణపై మండిపడ్డ కరాటే కళ్యాణి..

by Disha Web Desk 9 |
సొమ్ము కోసం బిగ్‌బాస్‌పై ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారేమో: సీపీఐ నారాయణపై మండిపడ్డ కరాటే కళ్యాణి..
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ షోపై సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బ్రోతల్ హౌస్ అంటూ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా.. ఆయన కామెంట్లపై ప్రముఖ నటి కరాటే కల్యాణి స్పందించింది. ‘‘నేను ఆల్రెడీ షోకు వెళ్లే వచ్చాను. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు. తరచూ నారాయణ ఈ షోపై ఏదో ఒక కామెంట్ చేస్తుంటారు. డబ్బు కానీ కావాలేమో.. మనీ ముట్టినాక ఆయన సైలెంట్ అయిపోతారు కావచ్చు. బయట వినిపిస్తున్న టాక్ నేను చెబుతున్నాను అంతే.

తన పిల్లలను ఎన్నడైనా విహార యాత్రకు, వినోదాలకు తీసుకెళ్లాడో లేదో అస్సలు. ఆయన నోటికి ఎంతోస్తే అంత మాట్లాడుతారు.’’ అంటూ కళ్యాణి వెల్లడించింది. అలాగే షోకు వెళ్లిన వాళ్లు 6 నెలలపాటు ఎక్కడా వర్క్ చేయకుండా ఒప్పందం చేసుకొంటారు. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక క్రేజ్ ఉంటుంది. కానీ ఆరు నెలలు గడిచిన తర్వాత సెలబ్రిటీలను ఎవరూ పట్టించుకోరని తెలిపింది. ప్రస్తుతం కరాటే కళ్యాణి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More: గర్ల్‌ఫ్రెండ్‌తో ‘జవాన్’ చూసేందుకు ఫ్రీ టికెట్ అడిగిన నెటిజన్.. షారుఖ్ ఖాన్ రియాక్షన్ ఇదే


Next Story