‘Tiger Nageswara Rao’‌కి కౌంట్ డౌన్ స్టార్ట్.. ఏకంగా బాలయ్య‌తోనే పోటీ

by Phanindra |   (  Updated:2023-09-20 06:03:37  IST  )

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’.

‘Tiger Nageswara Rao’‌కి కౌంట్ డౌన్ స్టార్ట్.. ఏకంగా బాలయ్య‌తోనే పోటీ
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టైగర్ నాగేశ్వరరావు అనే ఓ గజ దొంగ‌కు సంబంధించిన బయోపిక్. అక్టోబర్ 20న విడుదల కానుంది. అయితే మూవీ టీమ్ ఈ విషయాన్ని గుర్తు చేస్తూ తాజాగా ఓ ఫైర్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ‘మరో 111 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా వేట ప్రారంభం కానుంది’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. అయితే అదే రోజు బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘భగవంత్ కేసరి’ కూడా రిలీజ్ చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక వీటితో పాటుగా లోకేష్ కనగరాజ్-విజయ్ దళపతి కాంబోలో ‘లియో’ మూవీ కూడా రానుంది. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ ముందు ఎవరెలా నిలుస్తారో చూడాల్సిందే మరి.

Read More: సింగర్ చిన్మయిపై ట్రోల్స్.. ఆమెను అర్థం చేసుకోండి అంటూ రాహుల్ ఎమోషనల్ నోట్

Next Story