నెలరోజులకే ఓటీటీలోకి రాబోతున్న సూపర్ స్టార్ మూవీ.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుందంటే? (పోస్ట్)

by Mallepaka Hamsa |

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కూలీ’(coolie).

నెలరోజులకే ఓటీటీలోకి రాబోతున్న సూపర్ స్టార్ మూవీ.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుందంటే? (పోస్ట్)
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కూలీ’(coolie). లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)విలన్ పాత్రలో నటించగా.. ఉపేంద్ర, శృతి హాసన్, ఆమిర్ ఖాన్, సౌబిన్ షాహిర్ కీలక పాత్రలో కనిపించారు. సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ చేసి సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఆగస్టు 14న థియేటర్స్‌లో రిలీజ్ అయి మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ప్రశంసలు పొందడంతో పాటు కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది. మరీ ముఖ్యంగా నాగార్జున పాత్రపై సినీ సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపించారు.

దీంతో సినీ ప్రియులంతా ‘కూలీ’ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ప్రముఖ సంస్థ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైనట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా.. సెప్టెంబర్ 11 నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రాబోతున్నట్లు వెల్లడించారు. దేవా, సైమన్,దహా వైబ్ చూసేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Next Story