మృణాల్‌కు ఎంగేజ్మెంట్ రింగ్ పంపిన స్టార్ సెలబ్రిటీ.. అమ్మాయి దొరికింది అంటూ పోస్ట్..

by Dishafeatures3 |
మృణాల్‌కు ఎంగేజ్మెంట్ రింగ్ పంపిన స్టార్ సెలబ్రిటీ..  అమ్మాయి దొరికింది అంటూ పోస్ట్..
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్ రీసెంట్‌గా ‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోసారి ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసింది. అటు బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్న అమ్మడు.. సౌత్‌ను కూడా ఏలేస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మృణాల్.. రీసెంట్‌గా హోస్ట్ తన్మయ్ భట్‌కు రిప్లయ్ ఇచ్చి, సెటైర్ వేయించుకుంది.

ఓ ఈవెంట్‌కు సంబంధించిన వీడియో పోస్ట్ చేసిన తన్మయ్.. ‘ఇక్కడ వీళ్లను ఇంట్రడ్యూజ్ చేసేందుకు నేను ఉన్నాను, మరి నా లైఫ్ పార్టనర్‌ను పరిచయం చేసేందుకు ఎవరున్నారు?’ అని రాసుకొచ్చాడు.దీంతో ‘అమ్మాయి దొరికిందా?’ అని రిప్లయ్ ఇచ్చింది మ‌ృణాల్. దీనికి రియాక్ట్ అయిన ఆయన.. ‘అవును నిన్ననే కదా నీకు రింగ్ పంపించా’ అని రిప్లయ్ ఇచ్చాడు. కాగా ఈ కన్వర్జేషన్‌పై నెటిజన్ల నుంచి మిక్స్‌డ్ రియాక్షన్ వస్తుంది.

Read More...

Sridevi : శ్రీదేవి అత్యంత భావోద్వేగానికి లోనైన సందర్భం.. ‘ఐ లవ్ యూ లబ్బూ’ అంటూ ఎంతగా బాధపడిందో..

Next Story