- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదిపురుష్ సినిమాపై వివాదం.. ఆగిపోయిన షోస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్’.

X
దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్’. ఎన్నో అంచనాల నడుమ నేడు రిలీజైన ఈ సినిమా.. ప్రస్తుతం వివాదాల్లో చిక్కుంది. నేపాల్‌లో ఈ సినిమాపై వివాదం తలెత్తింది. సీత భారత్‌లో జన్మించినట్లు చూపించడంపై నేపాల్ సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. సీత నేపాల్‌లో జన్మించారని, సినిమాలో దీనిని సవరించకుంటే మూవీ విడుదలకు అనుమతినివ్వమని స్పష్టం చేసింది. దీంతో ఆదిపురుష్ టీం ఇందుకు సంబంధించిన డైలాగ్స్‌ను మూవీ నుంచి తొలగించడంతో నేపాల్‌లో మూవీ విడుదలకు లైన్ క్లియర్ అయింది. కానీ మార్నింగ్ షోలు నిలిపివేసినట్లు సమాచారం.
Read more : ఆదిపురుష్ సినిమా చూడటానికి వచ్చిన రియల్ హనుమాన్! (వీడియో)
Next Story






