యాక్షన్ థ్రిల్లర్ ‘మారియో’ సినిమాలో కాంట్రవర్సీ బ్యూటీ.. అధికారిక ప్రకటన విడుదల

by Mallepaka Hamsa |

‘కుమారి 21ఎఫ్’ చిత్రంతో ఇండస్ట్రీకి వచ్చి.. ఫుల్ ఫేమ్ దక్కించుకుంది హెబ్బా పటేల్(Hebba Patel).

యాక్షన్ థ్రిల్లర్ ‘మారియో’ సినిమాలో కాంట్రవర్సీ బ్యూటీ.. అధికారిక ప్రకటన విడుదల
X

దిశ, సినిమా: ‘కుమారి 21ఎఫ్’ చిత్రంతో ఇండస్ట్రీకి వచ్చి.. ఫుల్ ఫేమ్ దక్కించుకుంది హెబ్బా పటేల్(Hebba Patel). ఆ తర్వాత ఎక్కడికి పోతావ్ చిన్నవాడా, ఓదెల రైల్వే స్టేషన్ వంటి సూపర్ హిట్ సినిమాలతో తనదైన ముద్ర వేసుకుంది. ప్రస్తుతం హెబ్బా పటేల్ ఓ యాక్షన్ థ్రిల్లర్ ‘మారియో’ (Mario)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అనిరుధ్(Anirudh), హెబ్బా పటేల్ జంటగా నటిస్తుండగా.. కళ్యాణ్ జీ గోగణ(Kalyan Ji Gogana) దర్శకత్వంలో తెరకెక్కుతోంది. సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్, రాకేందు మౌళి సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచిన విషయం తెలిసిందే. ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి వస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ‘మారియో’ సినిమాలో ఓ కాంట్రవర్సీ నటి నటిస్తున్నట్లు తెలుపుతూ చిత్రబృందం మాస్ పోస్టర్‌ను షేర్ చేశారు.

ఇందులో ఇండస్ట్రీలో పలు వివాదాలు ఎదుర్కొన్న కల్కికా గణేష్.. ‘జోరా’ పాత్రలో కనిపించనున్నట్లు తెలుపుతూ.. బ్లాక్ కలర్ డ్రెస్‌లో సిగరెట్ చేతిలో పట్టుకున్న పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘ఆవేశపూరితమైన.. భయంకరమైన పాత్రలో కల్పిక నటిస్తుంది. నవంబర్ నుండి సినిమాల్లో టర్బో-చార్జ్డ్ ర్యాంప్ రైడ్‌ను అనుభవించండి’’ అనే క్యాప్షన్ జత చేశారు. కాగా.. ఇటీవల కల్కికా ఓ బార్‌లో నానా రబస చేసిన విషయం తెలిసిందే. మొయినాబాద్ మండలం కనకమామిడి రెవెన్యూలోని బ్రౌన్‌టౌన్ రిసార్టులో ఓ గదిలోకి వెళ్లి భోజనం చేసింది. సాయంత్రానికి సిగరెట్లు కావాలని కోరడంతో.. సిబ్బంది లేవనడంతో నానా హంగామా చేసింది. గది తాళాలను విసిరేసింది. ఈక్రమంలోనే.. తనపై రిసార్ట్ సిబ్బంది తనతో అసభ్యంగా వ్యవహరించినట్లు వీడియో విడుదల చేసి వార్తల్లో నిలిచింది. దీంతో కొద్ది కాలంపాటు కల్పికా గణేష్ వార్తల్లో నిలిచి నానా రచ్చ చేసింది.

link

Next Story