- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Big Boss-9: నామినేషన్స్‌లో రెచ్చిపోయిన కంటెస్టెంట్స్.. ఎవరెవరు డేంజర్‌లో ఉన్నారంటే?
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ అప్పుడే వారం పూర్తి అయిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ అప్పుడే వారం పూర్తి అయిన విషయం తెలిసిందే. ఈ సారి హౌస్‌లోకి 9మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ ఇంట్లోకి మొత్తం 15 మంది వెళ్లారు. ఇరువురి మధ్య పలు టాస్కులు జరిగినప్పటికీ శ్రేష్టి వర్మ పెద్దగా యాక్టివ్‌గా లేకపోవడం అంతా నామినేట్ చేశారు. ఇక ఇందులో గత వారం శ్రేష్టి వర్మ ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. రెండో వారం నామినేషన్స్ స్టార్ట్ చేసిన బిగ్‌బాస్ ఓ ఇద్దరిని ఎంచుకుని ఎరుపు రంగు పూయాలని చెప్తాడు. ఇందులో తనూజ మాస్క్ మ్యాన్ హరీష్, ఫ్లోరాలను నామినేట్ చేసింది. ఆ తర్వాత మనీష్, రితూ వర్మ నామినేట్ చేయగా.. రితూ రెచ్చిపోయి అరుస్తుంటుంది.
మనీష్ రిటర్న్ ఇంకా బాగుంది అరవండి అని సెటైర్ వేస్తాడు. అయినప్పటికీ రితూ తగ్గేదేలా అన్నట్లుగా బిహేవ్ చేస్తోంది. ఆ తర్వాత మనీష్ భరణిని నామినేట్ చేస్తాడు. ఫుడ్ విషయంలో భరణి, ప్రియా ఘోరంగా అరుచుకుంటారు. హౌస్‌మెట్స్ అందరూ ప్రియాకు సపోర్ట్‌గా ఉన్నప్పటికీ భరణి తనకు అనిపించింది చెప్తారు. ఎంగిలి పెట్టింది తనకు నచ్చలేదని అందరికీ థ్రోట్ ఇన్‌ఫెక్షన్ వస్తుందని భరణి వాదన పెడతాడు. దీంతో కూడా ఏ మాత్రం తగ్గకుండా పోటాపోటీగా మాట్లాడుతుంది. ఇక వెంటకే భరణి పవన్‌తో వాదన పెట్టుకుంటాడు. ఎగ్ విషయం గురించి చర్చ మొదలవుతుంది.
రెచ్చిపోయిన పవన్ కంటెస్టెంట్స్ యాక్షన్స్ కూడా చేసి చూపిస్తాడు. మొత్తానికి ఈ సారి నామినేషన్స్‌తో హౌస్‌లో హీట్ పుట్టించిందనే చెప్పాలి. అయితే ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారంటే.. ప్రియా, ఫ్లోరా, పవన్, భరణి, మర్యాద మనీష్, మాస్క్ మ్యాన్ హరీష్ నామినేట్ అయి డేంజర్‌లో ఉండగా.. ఇందులో ఎవరు ఇంటి నుంచి వెల్లారా? అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇక సంజనా కెప్టెన్ కావడంతో ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకుంది. అలాగే ఇమాన్యుయేల్ ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేసి సేఫ్ అయ్యాడు. ఈ ఇద్దరికి లక్ కలిసిరాగా.. మరికొందరు కంటెస్టెంట్స్ కూడా ఈ వారం సేవ్ అయ్యారు.






