‘కానిస్టేబుల్’ ట్రైలర్ రిలీజ్.. కెరీర్‌ను మలుపుతిప్పే మూవీ అవుతుందంటూ అంచనాలు పెంచేసిన వరుణ్

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-22 15:13:46  IST  )

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ (Varun Sandesh) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కానిస్టేబుల్’(Constable).

‘కానిస్టేబుల్’ ట్రైలర్ రిలీజ్.. కెరీర్‌ను మలుపుతిప్పే మూవీ అవుతుందంటూ అంచనాలు పెంచేసిన వరుణ్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ (Varun Sandesh) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కానిస్టేబుల్’(Constable). మధులిక వారణాసి(Madhulika Varanasi) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆర్యన్ సుభాన్ (Aryan Subhan)దర్శకత్వంలో తెరకెక్కుతోంది. థ్రిల్లర్ కథతో రాబోతున్న ఈ చిత్రాన్ని జగదీష్ నిర్మించారు. మహా మూవీస్, ఎమ్ 3 మీడియా బ్యానర్స్‌పై మహేంద్ర నాథ్ కుండ్ల నిర్మిస్తున్నారు. ఇందులో రవి వర్మ మురళీ ధర్ గౌడ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

ఈనేపథ్యంలో.. తాజాగా, చిత్రబృందం ‘కానిస్టేబుల్’ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ఓ ప్రాంతంలో వరుస హత్యలు జరగడం.. అప్పుడే కొత్తగా విధుల్లోకి వచ్చిన కానిస్టేబుల్ ఈ కేసు విషయంలో ఆసక్తి చూపడం ఆ తర్వాత జరిగిన పరిణామాలు హీరో ఎలా ఎదుర్కొన్నాడో చూపించారు. ఇక ఈ ట్రైలర్ లాంచ్‌లో పాల్గొన్న వరుణ్ సందేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘ఈ సినిమా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఆర్యన్ చెప్పిన స్టోరీ నాకు బాగా నచ్చింది అందుకే ఒప్పుకున్నా. నేను నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈ మూవీ మీకు డెడికేట్ చేస్తున్నాను. తప్పకుండా మా అంచనాలను ‘కానిస్టేబుల్’ నిలబెడుతుందని అనుకుంటున్నాను. మా అందరి కెరీర్ మలుపుతిప్పే చిత్రం ఇది’’ అని చెప్పుకొచ్చాడు.

Next Story