శర్వానంద్‌- శ్రీనువైట్ల సినిమాలో ఆ యంగ్ బ్యూటీ ఫిక్స్.. పక్కా హిట్ అంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2026-01-19 05:06:09  IST  )

శర్వానంద్‌ (Sharwanand), శ్రీనువైట్ల (Srinu Vaitla) కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే.

శర్వానంద్‌- శ్రీనువైట్ల సినిమాలో ఆ యంగ్ బ్యూటీ ఫిక్స్.. పక్కా హిట్ అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: శర్వానంద్‌ (Sharwanand), శ్రీనువైట్ల (Srinu Vaitla) కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ‘8 వసంతాల’ ఫేమ్‌ అనంతిక సనీల్‌ కుమార్‌ను (Anantika Sanil kumar) హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. శ్రీను వైట్ల గత చిత్రం ‘విశ్వం’ ఏవరేజ్‌గా ఆడింది. దీంతో ఎలాగైనా హిట్‌ సినిమా తీయాలనే కసి మీదున్నారు. ఈ మేరకు కథ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారట. తెలియని వయసులో ఆవేశంలో చేసిన ఓ పని కారణంగా హీరో లైఫ్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్న ఇతివృత్తంతో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాను భారీ నిర్మాణాల సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనుందని, అలాగే ఈ మూవీలో మరో సీనియర్‌ హీరో కూడా కనిపిస్తారని టాక్‌. ఇందులో భాగంగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఇందులో యంగ్ బ్యూటీ అషికా రంగనాథ్(Ashika Ranganath) హీరోయిన్‌గా ఫిక్స్ అయిందట. ఈ ఏడాది మార్చి నుంచి ఈ సినిమా షూటింగ్‌ మొదలు కానున్నట్టు తెలిసింది.

ఈ సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’తో గ్రాండ్‌ విక్టరీని అందుకున్నారు హీరో శర్వా. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఫ్యాన్స్ ఈ సినిమా పక్కా హిట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా అమిగోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ ఆ తర్వాత కింగ్ నాగార్జున నటించిన ‘నా సామిరంగ’ మూవీలో యాక్ట్ చేసింది. అలాగే రీసెంట్‌గా రవితేజ సరసన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీతో మన ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’లోనూ కీలక పాత్ర పోషిస్తోంది.

Read More..

వైట్ శారీలో నాని హీరోయిన్.. నీ అందాన్ని పొగడటానికి డిక్షనరీలో ఉన్న వర్డ్స్ కూడా సరిపోవంటూ కామెంట్స్

Next Story