ఓటీటీలోకి రాబోతున్న కామెడీ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

by Jakkula Samataha |

ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్. ఇప్పటికే ఓటీటీలో చాలా సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజై, సందడి చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, నేడు మరో కామెడీ మూవీ కూడా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. నటి, బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా

ఓటీటీలోకి రాబోతున్న కామెడీ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
X

దిశ, సినిమా : ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్. ఇప్పటికే ఓటీటీలో చాలా సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజై, సందడి చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, నేడు మరో కామెడీ మూవీ కూడా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. నటి, బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా భార్య తాహిరా కశ్యప్ డైరెక్ట్ చేసిన శర్మాజీ కీ బేటీ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో త్వరలో స్ట్రీమింగ్ కానుందని, తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది. జూన్ 28 నుంచి ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో సాక్షి తన్వర్ లీడ్ రోల్‌లో నటించింది. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందినట్లు సమాచారం. ఫుల్ కామెడీతో ఈ మూవీ ప్రేక్షకుల నోట నవ్వులు పూయించనుందంట. ఇక తాహిరా కశ్యప్ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ఇది. దీంతో ఈమె తొలిసారిగా దర్శకురాలిగా పరిచయం అవుతోంది.

ఇక ఈ సినిమా ప్రస్తుత సమాజంలో మహిళల సాధికారత, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యల చుట్టూ సినిమా తిరుగుతుందని, ముగ్గురు మహిళలు, ఇద్దరు టీనేజ్ అమ్మాయిల అనుభవాలు, కష్టాలను సదరగా చూపించినట్లు దర్శకురాలు తెలిపింది. అలాగే మూవీలో కామెడీ ఫుల్‌గా ఉంటుందని, ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని ఆమె తెలిపింది.

Next Story