- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటీటీలోకి రాబోతున్న కామెడీ ఎంటర్‌టైనర్.. అధికారిక ప్రకటన విడుదల
గత కొద్ది కాలంగా తెలంగాణ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సినిమాలు బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలుస్తున్నాయి.

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా తెలంగాణ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సినిమాలు బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలుస్తున్నాయి. ఇక 2023లో వచ్చిన ‘బలగం’ మూవీ ఎంత పెద్ద హిట్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీ ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. అలాగే ఇందులో నటించిన నటీనటులకు ఫుల్ పాపులారిటీ దక్కిందనడంలో అతిశయోక్తి లేదు. అలాగే పలు అవార్డులు కూడా వచ్చాయి. ఇక ఇటీవల విలేజ్ బ్యాక్‌గడ్రాప్‌లో వచ్చిన సినిమా ‘బద్మాషులు’(Badmashulu ).
ఇందులో బలగం ఫేమ్ మురళీ ధర్(Murali Dhar), కేతిరి సుధాకర్ రెడ్డి(Kethiri Sudhakar Reddy), ప్రధాన పాత్రలో నటించగా.. మహేష్ చింతల, విద్యాసాగర్ కారం పూరి, కీలక పాత్రలో కనిపించారు. శంకర్ చేగూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని తార స్టోరీ టెల్లర్స్ బ్యానర్‌పై బి. బాలకృష్ణ నిర్మించారు. ఈ చిత్రం జూన్ 6న థియేటర్స్‌లోకి వచ్చి మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు రెండు నెలలకు డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుంది. తాజాగా, ప్రముఖ సంస్థ ఈ విషయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘బద్మాషులు’ మూవీకి సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ ఈటీవీ విన్ సొంతం చేసుకోగా ఆగస్టు 8 నుంచి ఫుల్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించనుంది.






