Basavaraj Bommai: అందరి ముందే క‌న్నీరు పెట్టుకున్న సీఎం.. ఆ సినిమా చూసి తట్టుకోలేక..!

by Disha Web Desk 19 |
Karnataka CM Basavaraj Bommai Breaks Down After Watching 777 Charlie
X

దిశ, వెబ్‌డెస్క్: Karnataka CM Basavaraj Bommai Breaks Down After Watching 777 Charlie| కన్నడ హీరో రక్షిత్ శెట్టి, సంగీత శృంగెరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం `777 చార్లీ`. మనిషికి, పెంపుడు కుక్కకు మధ్య ఉండే అనుబంధం నేపథ్యంలో రూపొందుకున్న ఈ మూవీ.. జూన్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం.. సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే, ఇటీవల ఈ సినిమాను కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై చూశారు. సినిమా చూసిన అనంతరం బాగా ఎమోషనల్ అయిన బొమ్మై కన్నీరు పెట్టుకున్నారు. సినిమా చాలా బాగుందని.. తనకు ఎంతో నచ్చిందని అన్నారు. ఈ అద్భుతమైన సినిమాను అందరు చూడాలని కోరారు. మనిషికి, శునకానికి మధ్య ఉండే అనుబంధాన్ని మేకర్స్ అద్భుతంగా చూపించారని కొనియాడాడు.

ఇదిలా ఉంటే, సహజంగానే బొమ్మై జంతు ప్రేమికుడు. అతడికి జంతువులు అంటే ఎంతో ఇష్టం. ఈ సినిమా చూడటంతో గతేడాది తమ ఇంట్లో చనిపోయిన పెంపుడు శునకం గుర్తుకు వచ్చిందని బాగా ఎమోషనల్ అయ్యారు. కుక్కలు త‌మ య‌జ‌మానుల ప‌ట్ల చూపేది అన్‌కండిష‌నల్ ప్రేమ‌ అని అందరి ముందే బహిరంగా కన్నీరు పెట్టుకున్నారు.

Next Story

Most Viewed