Jr. NTR : రాజీవ్ కనకాల- జూనియర్ ఎన్టీఆర్‌కు గొడవలు.. క్లారిటీ?

by Disha Web Desk 9 |
Jr. NTR : రాజీవ్ కనకాల- జూనియర్ ఎన్టీఆర్‌కు గొడవలు.. క్లారిటీ?
X

దిశ, వెబ్‌డెస్క్: ‘బబుల్ గమ్’ అనే చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు స్టార్ యాంకర్ సుమ కుమారుడు రోషన్. ఈ సినిమా డిసెంబర్ 29న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. చిత్ర షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చిత్ర బృందం ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా రోషన్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నాడు. తాజాగా రోషన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. యాంకర్ అడిగే ప్రశ్నలకు కూల్ గా సమాధానం చెప్పాడు. ‘బబుల్ గమ్’ లో ముద్దు సీన్స్ గురించి యాంకర్ ప్రశ్నలకు రోషన్ సీరియస్ గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ అదంతా ఫన్నీగా జరిగింది. తర్వాత జూనియర్ ఎన్టీఆర్-రాజీవ్ మధ్య ఫ్రెండ్షిప్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

వీరిద్దరి స్నేహం గురించి రోషన్ మాట్లాడుతూ.. ‘‘నాన్న- తారక్ మధ్య స్నేహం స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం నుంచి ఏర్పడింది. నా ఫ్రెండ్ చాలా మంచివాడు. అలాంటి స్నేహితులను ఎప్పుడు వదులుకోకూడదని ఎన్టీఆర్ గురించి చెప్పేవారు. ఇక నాన్న ఎప్పుడు చూడు తారక్ అన్నను చూసి డ్యాన్స్ నేర్చుకోమని నాకు సలహా ఇచ్చేవారు. నటనలో నేను కూడా తారక్ అన్న స్థాయికి వెళ్లాలని నా కోరిక. ఇక వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ కామన్. అందులో నిజం లేదు. వాళ్ళిద్దరు ఎప్పుడు అలా ప్రవర్తించలేదు. అంటూ రోషన్.. ఎన్టీఆర్- రాజీవ్ కనకాల మధ్య స్నేహబంధం గురించి, గొడవలు గురించి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ స్ప్రెడ్ అవుతుంది.

Read More : తాకర్‌పై ‘యానిమల్’ హాట్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్


Next Story