తాకర్‌పై ‘యానిమల్’ హాట్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

by Disha Web Desk 7 |
తాకర్‌పై ‘యానిమల్’ హాట్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: త్రిప్తి దిమ్రి.. ప్రజంట్ ఎక్కడ చూసినా ఈ అమ్మడి గురించే చర్చ జరుగుతోంది. 2017లో వచ్చిన ‘పోస్టర్ బాయ్స్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన త్రిప్తి. రొమాంటిక్ డ్రామా ‘లైలా మజ్ను’(2018)లో మొదటిసారి ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది. కానీ ‘యానిమల్’ చిత్రంతో ఆమె ఊహించని విధంగా పాపులారిటీ దక్కించుకుంది. రణ్‌బీర్ గర్ల్ ఫ్రెండ్‌గా రొమాంటిక్ సీన్స్‌లో రెచ్చిపోవడంతో సోషల్ మీడియా మొత్తంలో త్రిప్తి ఫోటోలు, వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. కాగీ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిప్తి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సౌత్‌లో ఏ హీరోతో నటించాలని ఉంది? అనే ప్రశ్నకు ‘నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం.. ఆయనతో కలిసి నటించాలని ఎదురు చూస్తున్నా’ అని తెలిపింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Read More: Jr. NTR : రాజీవ్ కనకాల- జూనియర్ ఎన్టీఆర్‌కు గొడవలు.. క్లారిటీ?


Next Story