- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభాస్ ‘సలార్’ ట్రైలర్ యూనివర్సల్ వెర్షన్‌పై క్లారిటీ..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘సలార్’

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘సలార్’. సెప్టెంబర్ 28న గ్రాండ్‌గా విడుదలకానుందని మొదట ప్రకటించిన తర్వాత వాయిదాల మీద వాయిదాలు పడుతూ మొత్తానికి డిసెంబర్ 22న విడుదల కాబోతుంది. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని హోంబలే ఫిల్మ్స్ భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్‌లో నిర్మిస్తున్నారు. అలాగే రవి బసృర్ సంగీతం అందించిన ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతి బాబు కీ రోల్స్ పోషించారు. ఇకపోతే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కోసం ప్రేక్షకులంతా ఓ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ట్రైలర్‌పై రీసెంట్‌గా ఓ బజ్ అయితే బయటకి వచ్చింది.
ఈ మూవీ యూనివర్సల్ ట్రైలర్‌ను సింపుల్‌గా ఇంగ్లీష్‌లో రెడీ చేసే ఆలోచనలో నీల్ ఉన్నారని టాక్ రాగా.. దీనిపై ప్రభాస్ టీం తాజాగా క్లారిటీ ఇచ్చింది. ‘ట్రైలర్ విషయంలో అలాంటిది ఏమి లేదు. ఒకవేళ ఏమన్నా ఉంటే అప్డేట్ అందిస్తాం’ అని తెలిపారు. కాగా ‘కేజీఎఫ్ 2’ ట్రైలర్ కూడా కేవలం ఇంగ్లీష్‌లో రిలీజ్ చేయడంతో.. ప్రశాంత్ నీల్ మళ్లీ అదే పద్ధతి ఫాలో అవుతాడని ప్రచారం జరుగుతుంది.






