‘నా యోనిపై విభిన్న ప్రయోగాలు చేస్తుంటా..’ సింగర్ హాట్ కామెంట్స్

by Disha Web Desk |
‘నా యోనిపై విభిన్న ప్రయోగాలు చేస్తుంటా..’ సింగర్ హాట్ కామెంట్స్
X

దిశ, సినిమా: ప్రముఖ అమెరికన్ స్టార్ సింగర్ క్రిస్టినా అగ్యిలేరా.. లేటు వయసులో మహిళలు భావప్రాప్తి పొందడం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అంతేకాదు ప్రస్తుతం 42 ఏళ్ల వయసున్న గాయని తన యోనిపై విభిన్న ప్రయోగాలు కూడా చేసినట్లు చెబుతూ.. పార్ట్‌నర్ లేకుండానే ఉద్వేగం పొందడానికి నాలుగు ప్లెజర్ పాటింట్స్ (pleasure points) కనుగొన్నట్లు చెప్పింది. విభిన్న యాంగిల్స్‌‌లో పలు రకాల పరికరాలు ఉపయోగించకుండానే క్లైమాక్స్ చేరుకుంటూ ఎంజాయ్ చేస్తున్నానన్న ఆమె.. తనలాగే మహిళలు సహజంగా పురోగతి చెందేలా మోటివేట్ చేయాలనుకుంటున్నట్లు తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది.

‘ఇతర స్త్రీలు తమ అనుభవాల గురించి, వారి శరీరం, లైంగికత విషయాల గురించి ఓపెన్‌గా మాట్లాడేలా ప్రేరణపొందాలని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే ప్రతి స్త్రీ భిన్నంగా ఉంటుంది. గత 42 సంవత్సరాలుగా నేను నా యోని గురించి బాగా తెలుసుకున్నాను. చెప్పడాని హస్యాస్పదంగా ఉన్నా.. నాకు నేనే నా కన్యత్వాన్ని కోల్పోయేలా చేసుకున్నా. ఆ తర్వాత స్వీయ సంతృప్తి కోసం మరిన్ని అవకాశాలున్నాయని గమనించాను. వృద్ధాప్యంలోనూ ఆనందకరమైన సెక్స్ సొంతం చేసుకోగల టిప్స్ ఉన్నాయి. భాగస్వామి లేకపోయినా స్వంత డేట్ నైట్‌ హ్యాపీగా గడపవచ్చు. ఇందుకోసం మన శరీరాల గురించి మరింత జ్ఞానాన్ని సంపాదించాలి. వయసు పెరుగుతున్న కొద్ది మన వెజినాలో మార్పులను గమనించాలి. ఎమోషన్స్, ఫీలింగ్స్‌పై అవగాహన పెంచుకోవాలి. దాని నుంచి ఆనందాన్ని పొందే మార్గాలను గుర్తించాలి. మన బాడీలో ఏం జరుగుతుందో తెలుసుకుని బలహీనతలను అధిగమించాలి. వయస్సు పెరిగేకొద్దీ మన శరీరాలు మారడమే కాదు కొన్ని ప్రాంతాలను సున్నితంగా మారుతాయి. ఇతరుల కోసం అన్వేషించకుండా మనల్ని మనం పురికొల్పుకుంటూ బాడీని మన కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ముఖ్యంగా మిమ్మల్ని మీరు తెలుసుకుంటే మరింత ఆహ్లాదకరమైన జీవితాన్ని గడపవచ్చు’ అంటూ పలు సూచనలు చేసింది.

ఇవి కూడా చదవండి:

పాయల్ రాజ్‌పుత్‌‌కు కావాల్సిందే ‘సెక్స్..సెక్స్.. సెక్స్’

Next Story

Most Viewed