ఫ్యాన్స్‌తో చిట్ చాట్.. అలాంటి పాత్రలే చేస్తా.. ఏమన్న ప్రాబ్లమా అంటున్న బోల్డ్ బ్యూటీ

by sudharani |   ( Updated:2024-04-29 14:31:42.0  )
ఫ్యాన్స్‌తో చిట్ చాట్.. అలాంటి పాత్రలే చేస్తా.. ఏమన్న ప్రాబ్లమా అంటున్న బోల్డ్ బ్యూటీ
X

దిశ, సినిమా: హీరోయిన్ మాళవికా మోహనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘ది రాజా సాబ్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం ప్రభాస్‌తో కూడా ఓ మూవీ చెయ్యబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు.. ‘తంగలాన్’ మూవీలో కూడా నటిస్తుంది. P. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్రమ్ హీరోగా నటిస్తున్నాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తన బోల్డ్ షోలతో కుర్రాళ్లకు పిచ్చేక్కిస్తుంది. అంతే కాకుండా అప్పడప్పుడు ఫ్యాన్స్‌తో చిట్ చాట్ కూడా చేస్తుంది.

ఈ క్రమంలోనే తాజాగా ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చెయ్యగా.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ మేరకు మీ పెళ్లి ఎప్పుడని, మొదటి క్రష్ గురించి అభిమానులు ప్రశ్నించారు. ఇందుకు ఆమె.. ‘నేను పెళ్లి చేసుకోవాలని ఎందుకు తొందరపడుతున్నావని సమాధానం ఇస్తూ.. తన క్రష్ హృతిక్ రోషన్ అని తెలిపింది. ఇక స్కిన్ షోలు చేయడం మానేసి.. మంచి సినిమాలు ఎప్పుడు చేస్తారు అని ప్రశ్నించగా.. ‘గ్లామర్ షో ఎప్పటికి ఆపను. గ్లామర్ ఫొటో షూట్ చెయ్యడం కూడా నాకు ఇష్టం అని చెప్తూ.. నీకు ఏదన్న సమస్య ఉందా అని తిరిగి ప్రశ్నించింది. కాగా.. ప్రస్తుతం ఈ చిట్ చాట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Read More...

హనీ రోజ్ క్రేజీ లుక్స్ వైరల్.. ట్రెండీ అవుట్‌ఫిట్‌లో ఆకట్టుకుంటున్న బ్యూటీ

Advertisement

Next Story