- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న చిరు.. మిలియన్ల వ్యూస్‌తో టాప్ ట్రెండింగ్‌లో ‘మీసాల పిల్ల’ సాంగ్

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’(Mana Shankaravaraprasad Garu). అనిల్ రావిపూడి (anil ravipudi) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా కనిపించనుంది. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’ అనే సాంగ్‌ను రిలీజ్ చేయగా..ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. భీమ్స్ సిసిరోలియో పాడిన ఈ ఎనర్జిటిక్ మెలోడీ చార్ట్‌బస్టర్‌గా మారడమే కాకుండా, ఈ పాట దేశవ్యాప్తంగా అరుదైన ఘనతను సాధించింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ‘మీసాల పిల్ల’ సాంగ్ ఇండియాలో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. 13 రోజులు అగ్రస్థానాన్ని కొనసాగించి 36 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది.
ఈ పాట పాన్-ఇండియా సంచలనంగా మారింది. ఈ పాటలోని క్యాచీ హుక్ స్టెప్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానులు పెద్ద ఎత్తున రీ క్రియేట్ చేస్తున్నారు. సాహూ గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతి గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ పండుగ వాతావరణంలో, కుటుంబ భావోద్వేగాలు, వినోదం, నిండిన ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. విక్టరీ వెంకటేశ్ ఈ చిత్రంలో పూర్తి స్థాయి కీలక పాత్రలో కనిపించనుండటం సినిమా మీద అంచనాలను మరింత పెంచింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోని భారీ సెట్‌పై శరవేగంగా సాగుతున్నట్లు సమాచారం.






